EPAPER

Congress : ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా.. సాఫీగా జరగాల్సిందే – సీఎం రేవంత్

Congress : ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా.. సాఫీగా జరగాల్సిందే – సీఎం రేవంత్

Congress : 


⦿ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ఫోకస్
⦿ వేగవంతం చేసేలా ప్రణాళికలు
⦿ ఉమ్మడి జిల్లాల వారీగా 9 మంది ఐఏఎస్‌ల నియామకం
⦿ తక్షణమే పర్యటనలు చేసి పరిశీలించాలని ఆదేశాలు
⦿ జిల్లాల వారీగా రోజు వారీ రిపోర్టులు
⦿ ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్, స్వేచ్ఛ : రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్​ను ప్రత్యేక అధికారిగా నియమించింది. అలాగే, రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. జిల్లాల వారీగా రోజు వారీ రిపోర్ట్ అందించాలన్నారు సీఎం.


ప్రత్యేక అధికారులు వీరే

⦿ ఆదిలాబాద్, నిర్మల్​, అసిఫాబాద్​, మంచిర్యాల – కృష్ణ ఆదిత్య
⦿ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల – ఆర్​వీ కర్ణన్​
⦿ నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట – అనితా రామచంద్రన్
⦿ నిజామాబాద్, కామారెడ్డి – ఏ శరత్
⦿ రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి- డీ దివ్య
⦿ మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌ కర్నూల్ – రవి
⦿ వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ – వినయ కృష్ణా రెడ్డి
⦿ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట- హరిచందన దాసరి
⦿ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం – కె సురేంద్ర మోహన్

ALSO READ : రిజర్వేషన్స్ కమిషన్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన బీసీ నేతలు

Related News

Formula E Race Scam: ఫార్ములా రేస్ స్కామ్.. ఏసీబీ దర్యాప్తు వేగవంతం, రేపో మాపో నోటీసులు

Rahul Gandhi: హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ.. కులగణనపై చర్చ, ఆపై

Kondakal Village Land Scam: కొండకల్ క్లియరెన్స్ పై ఈడీ ఫోకస్‌.. బాధితులకు ‘స్వేచ్ఛ’ ఆహ్వానం

CM Revanth Reddy: బర్త్ డే రోజున పాదయాత్ర.. మూసీ పునరుజ్జీవంపై దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth : విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తాం – విద్యార్ధులకు సీఎం రేవంత్ హామీ

BC Commission : రిజర్వేషన్స్ కమిషన్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన బీసీ నేతలు

Big Stories

×