EPAPER

CM Revanth Reddy : కొండారెడ్డిపల్లికి మహర్ధశ… మోడల్ విలేజ్’గా సీఎం స్వగ్రామం

CM Revanth Reddy : కొండారెడ్డిపల్లికి మహర్ధశ… మోడల్ విలేజ్’గా సీఎం స్వగ్రామం

CM Revanth Reddy Tour to Kondareddypalli : ఈసారి దసరా పండుగ కొండారెడ్డిపల్లికి మహర్దశను సాధించి పెట్టింది. తొలిసారిగా సీఎం హోదాలో స్వగ్రామంలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డికి అడుగడుగునా గ్రామస్థులు నీరాజనాలు పలికారు. తమ అభిమాన నేత, తమ గ్రామస్తుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారిగా ఊరికి విచ్చేస్తున్న సందర్భంగా పల్లెవాసుల సంబరం అంబరాన్ని తాకింది. ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి గ్రామస్తులు గజమాల, పూల జల్లులు, డప్పు దరువులు, కొలాటాలతో ఘన స్వాగతం పలికారు.


మరోవైపు సీఎం సైతం గ్రామస్తుల అంచనాలను అందుకున్నారు. వారికి దసరా పండుగ సందర్భంగా వరాల జల్లు కురిపించారు. కొండారెడ్డిపల్లి రూపురేఖలు మార్చేందుకు పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలోని స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఏటా దసరా పండగను స్వగ్రామంలో చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతున్నా, ముఖ్యమంత్రిగా రేవంత్ కొండారెడ్డిపల్లికి రాలేదు.


దసరా కావడంతో ఆనవాయితీని కొనసాగిస్తూ సీఎం సొంత ఊరికి రావడంతో ఇటు అధికార యంత్రాంగం సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది.

పండుగ నేపథ్యంలో గ్రామంలో రూ.72 లక్షలతో కొత్త పంచాయతీ భవనం, రూ.55 లక్షలతో అమర జవాను యాదయ్య స్మారక గ్రంథాలయం, రూ.45 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ సహా  రూ.45 లక్షలతో పశు వైద్యశాల భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తమ గ్రామంలో భారీ స్థాయిలో అభివృద్ది కార్యక్రమాలు మొదలవుతున్నందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News

CPI Narayana: పరువు లేని నాగార్జున.. దావా వేయడం ఎందుకు? బిగ్ బాస్ షో లక్ష్యంగా నారాయణ కామెంట్స్

Dasara: పండుగ రోజు ఇటువంటి కానుక ఊహించరు కూడా.. ఆల్ ఫ్రీ అంటూ తెగ పంచేశారు.. ప్రజలు క్యూ కట్టారు

Kondareddy Palli : కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ… దసరా గూస్ బంప్స్

Durga Mata Idol Vandalised: విగ్రహం ధ్వంసం కేసులో ఒకరి అరెస్ట్.. ఘటనకు అసలు కారణం చెప్పిన డీసీపీ

Telangana BJP: మొత్తం మార్చండి.. స్పీడ్ పెంచాలి.. పార్టీ అధిష్టానం గురి పెట్టింది.. బీజేపీ ఇంచార్జ్ పాటిల్

Mlc Elections: ప్రజాపాలన సాగిస్తున్నాం.. ప్రజల్లోకి వెళ్లండి.. విజయం మనదే కావాలి.. సీఎం రేవంత్

Big Stories

×