EPAPER

CM Revanth Reddy Kodangal Tour: కొండగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి..

CM Revanth Reddy Kodangal Tour: కొండగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి..
CM Revanth Reddy Kodangal Tour

CM Revanth Reddy Kodangal Tour: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఇవాళ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం కోస్గి లో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటనతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో ముందుగా కొడంగల్ చేరుకుంటారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ కు, డబుల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ట్రైబల్ వెల్ఫేర్ బిల్డింగ్ కు, 25కోట్ల రూపాయలతో నిర్మించనున్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి భూమి పూజ చేస్తారు.

Read More: నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ.. RRR సౌత్‌కు గ్రీన్ సిగ్నల్..


ఆ తర్వాత దౌల్తబాద్ లో జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి, బొమ్మరాస్ పేట్, నీటూరు లలో జూనియర్ కాలేజీల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం చంద్రకల్ లో పశు వైద్య కళాశాలకు, కోస్గి లో 30 కోట్లతో నిర్మించే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలకు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి శంకుస్థాపన చేస్తారు.

ఆ తర్వాత సీఎం మద్దూరు,కొడంగల్ లోని TSRWS భవనాలకు, 224 కోట్ల రూపాయలతో మెడికల్, నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. 2 వేల 9 వందల 45 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నారాయణపేట-కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ కు, 213 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్ లకు శంకుస్థాపన చేస్తారు.

ఆ తర్వాత హస్నాబాద్‌లో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేస్తారు. కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అరువాత కోస్గిలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటి సారిగా కొడంగల్ కు వస్తుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Big Stories

×