EPAPER
Kirrak Couples Episode 1

CM Revanth Reddy: జాబ్‌ గ్యారెంటీతో ఉచితంగా ఖరీదైన కోర్సు.. రేవంత్ కీలక నిర్ణయం

CM Revanth Reddy: జాబ్‌ గ్యారెంటీతో ఉచితంగా ఖరీదైన కోర్సు.. రేవంత్ కీలక నిర్ణయం

ప్రపంచ వ్యాప్తంగా BFSI సెక్టార్‌లోని IT, ITES నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, లండన్ స్టాక్ ఎక్చేంజీ వంటి బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయి. బీఎస్ఎఫ్ఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్ ను కీలకమైన వ్యాపార కేంద్రంగా గుర్తించాయి. కొత్తగా ఏర్పడే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకే ఇప్పటికే తెలంగాణ లోని యువత కోసం నైపుణ్య శిక్షణను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వం.

బీఎస్ఎఫ్ఐ రంగంలో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ప్రపంచంలో పేరొందిన కంపెనీలు ఒక్కో విద్యార్థిపై 5 లక్షల నుంచి 6 లక్షలు శిక్షణకు ఖర్చు చేస్తున్నాయి. మరోవైపు శిక్షణ పూర్తయిన తర్వాత విద్యార్థులు తమ సంస్థలో పని చేస్తారా.. లేదా ఎక్కువ ప్యాకేజీలకు మరో సంస్థకు వెళతారా.. అనే సవాళ్లు కూడా గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లకు ఎదురవుతున్నాయి. అందుకే పరిశ్రమల అవసరాలను, ఇప్పుడున్న సవాళ్లను అధిగమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ ప్రదర్శించారు.


జనవరిలోనే బీఎఫ్ఎస్ఐ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ డిమాండ్ కు అవసరమైన ఉద్యోగాల కల్పించే దిశగా యువతకు రెగ్యులర్ డిగ్రీతో పాటుగానే నైపుణ్య డిగ్రీ కోర్సును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి యువత బంగారు భవిష్యత్తుకు తోడ్పడేలా.. మరింత సాకారం అందించేందుకు సిద్దం అవుతోంది. అందులో భాగంగానే తెలంగాణ ఉన్నత విద్యామండలి.. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఖరీదైన మినీ డిగ్రీ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. రెగ్యులర్ డిగ్రీ కోర్సుతో పాటుగానే ఈ కోర్సును విద్యార్థులకు నేర్పించనున్నారు.

Also  Read: కృష్ణయ్య ప్లాన్ ఏంటి? వరుసగా నేతల భేటీలు.. ఏం జరుగుతోంది?

2024–25 అకడమిక్ ఇయర్ నుంచే ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెల 25వ తేదీన ,సీఎం రేవంత్ రెడ్డి.. ఈ నైపుణ్య శిక్షణ కోర్సులను ప్రారంభించానున్నారు. 5000 మంది ఇంజనీరింగ్, 5000 మంది నాన్ ఇంజనీరింగ్ విద్యార్ధులు కలిపి.. మొత్తంగా 10 వేల మంది విద్యార్థులకు ఈ వర్క్ కోర్సు నేర్పించనున్నారు.

అత్యంత ఖరీదైన కోర్సు కావటంతో రివాల్వింగ్ ఫండ్ తో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులతో ఈ ప్రోగ్రాం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకపోవటంతో పాటు విద్యార్థులకు ఖరీదైన ఫీజుల భారం ఉండదని అభిప్రాయపడుతున్నారు. అందుకు గాను ఇప్పటికే పలు సంస్థలతో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు.. సంప్రదింపులు జరిపినట్టు సమాచారం అందుతోంది. EQUIPPP అనే సంస్థను ఈ ప్రోగ్రాం నిర్వహణకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అటు బీఎఫ్ఎస్ఐ సంస్థలతో అనుసంధానానికి, మరోవైపు ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు. ప్రతి ఏడాది పది వేల మంది విద్యార్థులకు మూడేళ్ల పాటు అవసరమయ్యే రివాల్వింగ్ ఫండ్ ను ఈ సంస్థ సమీకరించనుంది.

డిగ్రీ కాలేజీల్లో BFSI కోర్సులో భాగంగా స్కిల్ ఎన్ హాన్స్ మెంట్ కోర్స్, జనరిక్ ఎలెక్టివ్స్ పాఠ్యాంశాలను పరిచయం చేయనున్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో దీన్ని మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్, యాక్సిలరేటెడ్ కోర్సుగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కోర్సులకు సంబంధించిన సిలబస్, పాఠ్యాంశాలను BFSI కన్సార్టియం ఇప్పటికే తయారు చేయగా.. పాఠ్య ప్రణాళికను బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదించింది. డిగ్రీతో పాటు ఈ కోర్సు పూర్తి చేస్తున్న విద్యార్దులకు సర్టిఫికెట్ తో పాటు ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌తో పాటు ఉద్యోగం కల్పించేలా ఈ ప్రోగ్రాం ప్రవేశపెట్టారు.

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడమే టార్గెట్ గా దూసుకుపోతున్న కాంగ్రెస్ సర్కారు.. యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ వారి బంగారు భవిష్యత్తు కోసం.. నైపుణ్య శిక్షణ కోసం యూనివర్సిటీని నెలకొల్పడమే కాకుండా.. ఇప్పుడు ఉద్యోగాల కోసం కూడా స్పెషల్ ప్రోగ్రాం రూపొందించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Hydra demolish: అమీన్‌‌పూర్‌.. కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

Bigtv Free Medical Camp: తెలంగాణలో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 27 నుంచి.. వివరాలు ఇవిగో

KTR: మూసీ పేరుతో భారీ కుంభకోణానికి కుట్ర.. రూ.లక్షన్నర కోట్లా!

R Krishnaiah: కృష్ణయ్య ప్లాన్ ఏంటి? వరుసగా నేతల భేటీలు.. ఏం జరుగుతోంది?

KTR: బీజేపీ ట్రాప్‌లో కేటీఆర్‌, డామిట్.. కథ అడ్డం తిరిగింది?

Hyderabad Business Hours: హైదరాబాద్ బిజినెస్ టైమ్ అంటే టైమ్.. తేడా వస్తే ఇక అంతే

Big Stories

×