EPAPER

CM Revanth Reddy: మీది ఉద్యోగం కాదు.. ఉద్వేగం: పోలీస్ పాసింగ్ ఔట్ పెరేడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: మీది ఉద్యోగం కాదు.. ఉద్వేగం: పోలీస్ పాసింగ్ ఔట్ పెరేడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి

– మీది ఉద్యోగం కాదు.. ఉద్వేగం
– తెలంగాణ ప్రతిష్ట, భద్రత మీ చేతుల్లోనే
– డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపండి
– కబ్జాకోరులను వదిలే ప్రసక్తే లేదు
– అవసరమైతే కోర్టుల్లో న్యాయపోరాటం
– ఏడాదిలో మరో 30 వేల ఉద్యోగాల భర్తీ
– మూసీ ప్రక్షాళన.. నిర్వాసితులకు డబుల్ ఇళ్లు
– తెలంగాణలో రైతు రాజ్యం బాధ్యత కాంగ్రెస్‌దే
– పోలీసుల పిల్లలకు 50 ఎకరాల్లో రెసిడెన్షియల్ స్కూల్
– పోలీస్ పాసింగ్ ఔట్ పెరేడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి


Police Passing out Parade: అమరుల బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో గత పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, గత డిసెంబర్‌ 3న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే, ప్రజాపాలన మొదలైందని, తెలంగాణ పునర్నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ సమీపంలోని తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొని, ట్రైనీ ఎస్సైల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ సన్నివేశం మీకే కాదు.. నాకూ ఓ మధుర జ్ఞాపకం’ అన్నారు. కని పెంచిన తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా, యువత సక్రమమైన దారిలో నడవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం తన ప్రసంగంలో ప్రస్తావించారు.

వాళ్లను వదిలిపెట్టం..
హైదరాబాద్ సిటీలో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతామని.. ఈ విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. చెరువుల ఆక్రమణలతోనే హైదరాబాద్ సిటీని వరదలు ముంచుతెత్తుతున్నాయని.. సిటీలోని చెరువులు అన్నీ చాలా వరకు కబ్జాకు గురయ్యాయని.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత, కర్తవ్యం ప్రభుత్వంపై ఉందన్నారు. ఎవరైనా ఫాంహౌస్ కట్టుకోవచ్చని, కానీ, ఆ ఫాంహౌస్ డ్రైనేజీని మంచినీటి జలాశయాల్లోకి వదులుతుండటంతో మంచినీటి చెరువులు నాశనమైపోతున్నాయన్నారు. ఒకప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలశయాలు హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని తీర్చేవని , అలాంటి చెరువులను చెరబట్టిన వారి కోసమే హైడ్రా ఏర్పాటు చేశామని, చెరువులను కబ్జా చేసినోళ్లను జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై, ఎవరైనా చెరువులను ఆక్రమించినా, సర్కారు స్థలాలు కబ్జా చేసినా వారి వెన్నులో వణుకు పుట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.


అదే జరిగితే.. నేను ఫెయిల్
ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించటమే.. హైడ్రా లక్ష్యమని, ఈ విషయంలో నిబంధనలను అతిక్రమించిన వారు ఎంతటివారైనా.. వదిలబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆక్రమణదారులు తాము కబ్జా చేసిన స్థలాలను స్వచ్ఛందంగా వదిలేసి, గౌరవంగా పక్కకు తప్పుకోవాలని, లేకుంటే ఉన్నపళంగా నేలకూలుస్తామన్నారు. కూల్చివేతలపై తాత్కాలికంగా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నా.. తమ ప్రభుత్వం కోర్టుల్లో కొట్లాడి వారి ఆక్రమణలను తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చెరువుల్లో తాము కట్టుకున్న విలాసవంతమైన విల్లాలను సీఎం కూల్చేయిస్తున్నాడని, కొందరు అక్కసుతో మాట్లాడుతున్నారని, కానీ, బలిసినోడి డ్రైనేజీ నీళ్లు గండిపేటలో కలుస్తుంటే ఆ నీటిని నగర ప్రజలకు సరఫరా చేస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్లేనన్నారు.

అందుకే.. మూసీ ప్రక్షాళన
హైదరాబాద్ నగరపు మురుగు నీరంతా పొరుగున ఉన్న నల్లగొండ జిల్లాను ముంచెత్తుతోందనీ, అందుకే తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనను చేపట్టిందని సీఎం అన్నారు. మూసీ తీరప్రాంతంలోని ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసీ రివర్ డెవలప్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి అక్కడ పేదవారికి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తామని, అక్కడి నాలాల్లో ఉన్న శాశ్వత నివాసదారుల పట్ల ఈ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరిస్తుందని, అక్కడ నివసించే 12 వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కల్పించి.. వాళ్లు గౌరవంగా బతికేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Also Read: Wednesday Fear: ఆ ఊరిని భయపెడుతోన్న ‘బుధవారం’.. 50 ఏళ్లుగా ఊహించని ఘటనలు, గ్రామాన్ని వదిలేసినా..

ఆ బాధ్యత మీదే
పోలీసు ఉద్యోగం.. కేవలం కొలువు కాదని, ఇది ఓ భావోద్వేగం అని సీఎం అన్నారు. ఏ సమస్య వచ్చినా బాధ్యతలు నిర్వహించేది పోలీసులే అని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలు ఉండకూడదని, కానీ కొందరు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, అలాంటి వాటితో బాటు సైబర్ నేరాలపై పోలీస్ డిపార్ట్మెంట్‌లో కొత్తగా చేరిన వారు ఈ వ్యసనాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఇక.. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవశ్యం అన్నారు. సైనిక్ స్కూల్ మాదిరిగా తెలంగాణ పోలీసుల పిల్లల కోసం ప్రత్యేకంగా 50 ఎకరాల్లో స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను రాబోయే రెండేళ్లలో ఏర్పాటు చేస్తామని, దాని పని ఆరంభించాలని అదే వేదిక నుంచి డీజీపీకి ఆదేశాలిచ్చారు. పోలీసుల బాధలు తనకు తెలుసునని, డిపార్ట్మెంట్‌లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. బుధవారం నాటి పరేడ్ కమాండర్‌గా మహిళా ఎస్ఐ పల్లి భాగ్య శ్రీ వ్యవహరించారు.

ఏడాదిలో మరో 30 వేల కొలువులు
నిరుద్యోగుల అసంతృప్తితోనే ఈ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఉద్యోగాల కల్పనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, సర్వీ్స్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 30 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చామని ఈ ఏడాది చివరి నాటికి గ్రూప్-1,2,3, డీఎస్సీ, పారామెడికల్ సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామన్నారు. ఓ పక్క ఉద్యోగాల భర్తీ చేపడుతూనే మరో పక్క పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. వీటి ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

మేము సైతం..
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టం, ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్ధం పలువురు సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితుల కోసం తెలంగాణ పోలీసులు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.11,06,83,571ల విరాళం అందించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ చెక్‌ను అందజేశారు.

Related News

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అనుచరుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

Big Stories

×