EPAPER

CM Revanth Reddy | రేవంత్ రెడ్డి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ముఖ్యమంత్రిగా ఒక లెక్క!

CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించిన సందర్భం. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం ముందు చేయాల్సిందెంతో ఉంది. విజన్ ఉన్న నేత రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రేవంత్ అభయహస్తం ఈ రాష్ట్రానికి ఆయువుపట్టై కాపాడాలని జనం కోరుకుంటున్న వేళ తెలంగాణ సరికొత్త శకంలోకి అడుగు పెడుతోంది.

CM Revanth Reddy | రేవంత్ రెడ్డి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ముఖ్యమంత్రిగా ఒక లెక్క!

CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించిన సందర్భం. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం ముందు చేయాల్సిందెంతో ఉంది. విజన్ ఉన్న నేత రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రేవంత్ అభయహస్తం ఈ రాష్ట్రానికి ఆయువుపట్టై కాపాడాలని జనం కోరుకుంటున్న వేళ తెలంగాణ సరికొత్త శకంలోకి అడుగు పెడుతోంది.


రేవంత్ రెడ్డి.. తెలంగాణలో అంతెందుకు దేశంలో పరిచయం అక్కర్లేని పేరు. ఫైర్ బ్రాండ్ కు కేరాఫ్. ప్రత్యర్థులకు సింహస్వప్నం.. తన 20 ఏళ్ల రాజకీయ జీవితమంతా ప్రజాపోరాటాలతోనే ముడిపడి ఉంది. ఎప్పుడూ ప్రతిపక్షమే. ఇన్నాళ్లకు అధికార పక్షం. అందులోనూ ముఖ్యమంత్రి పదవి. ఇది ఎంత కష్టపడితే వచ్చింది.. ఏం చేశారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు తెలంగాణను నడిపించే నాయకుడిగా ప్రయాణం మరో ఎత్తు.

అనుకున్నామని అన్నీ జరగవు. రేవంత్ విషయంలో కొన్ని జరిగాయి. 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తర్వాత రాజదండం చేతికి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి అన్నది అందరికీ అందేది కాదు. కొందరు తమ జీవితాంతం ఎంత ప్రయత్నించినా అందదు. రేవంత్ రెడ్డికి ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. జనం కోరుకున్న ప్రజా తెలంగాణ ఆవిష్కృతమైంది. ఇప్పుడు అసలైన సవాళ్లు ముందున్నాయి.


రేవంత్ రెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడు. అన్ని అంశాలపై పట్టు ఉంది. సైన్స్ అయినా ఎర్త్ సైన్స్ అయినా.. సామాజిక సమీకరణాలైనా.. సోషల్ వెల్ఫేర్ అయినా.. ఇలా ఇలా అన్నిట్లోనూ లోతైన సబ్జెక్ట్ ఉంది. పైగా.. గత ఇరవైఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉండడంతో అధికారంలో ఉన్న వాళ్లు ఎలాంటి తప్పులు చేస్తున్నారు.. ఎక్కడ నష్టం జరుగుతోంది.. ఎలా చేస్తే బెటర్ మెంట్ ఉంటుంది.. ఇలాంటి విషయాలపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి పట్టు ఉంది. ఆ అనుభవం ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడంలో చాలా వరకు పని చేస్తుందంటున్నారు.

ఏ రాజకీయ నాయకుడైనా.. చరిత్రలో నిలిచిపోవాలంటే.. వారు చేసే పనులే కీలకంగా ఉంటాయి. చరిత్ర సృష్టించాలన్నా… ఇంకోటైనా.. చేసే పనులే ముఖ్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు అద్భుతమైన అవకాశం నిలిచి ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావించి ప్రభుత్వాన్ని నడిపారు. అటు పేదలకు ఇటు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ పాలనలో తనదైన మార్క్ చూపించారు. ఇప్పుడు అలాంటి అవకాశం సీఎం రేవంత్ రెడ్డికి వచ్చింది.

ప్రజల హృదయానికి దగ్గరగా ఉన్న నాయకుడు ఎప్పుడూ చరిత్ర సృష్టిస్తూనే ఉంటారు. పైకి కనిపించే అభివృద్ధితో పాటు.. కనిపించని వాటికీ ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. ప్రతి వ్యక్తిని సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. ఈ విషయంలో తన కమిట్మెంట్ కు తిరుగులేదని రేవంత్ పలు సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు కూడా. ఎవరికీ రాని అపూర్వ అవకాశం ఇప్పుడు రేవంత్ రెడ్డికి దక్కింది. దాన్ని ఎలా వినియోగించాలో బాగా తెలిసిన వ్యక్తి. నలుగురికి మంచి చేయడం.. నాలుగు కాలాల పాటు జనాభిమానాన్ని సంపాదించుకోవడమే అజెండాగా అడుగులు వేయడం ఖాయమే.

తమది ప్రజాప్రభుత్వం అని మొదటి రోజు నుంచే జనంలో ఆ మార్క్ కనిపించేలా రేవంత్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఒక గడీగా మారిన ప్రగతి భవన్ ను ప్రజల భవన్ గా మార్చేశారు. బారికేడ్లు.. ఆంక్షలు తొలగించేశారు. ఎవరైనా రావచ్చు.. ఎవరైనా వెళ్లొచ్చు… అదిప్పుడు నిషేధిత ప్రాంతం కాదు… ప్రజల ప్రాంతం. ఇది తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో కూడుకున్న విషయం. సామాన్యుడు అడుగు పెట్టని ప్రాంతం ఇప్పుడు అందరికి ఆహ్వానం పలుకుతోంది. భావోద్వేగాలు చాలా ప్రభావం చూపుతుంటాయి. వాటిని అంచనా వేసుకుంటూ ముందుకు నడవడం కూడా ముఖ్యమే. కేసీఆర్ సర్కార్ పతనం అవడానికి అహంకారమే ప్రధానంగా పని చేసిందన్నది అందరు చెప్పే మాట. అందుకే రేవంత్ సర్కార్ వస్తూనే ప్రజల్లో ఇది ప్రజల ప్రభుత్వం అని సంకేతాలను ఇచ్చి ప్రగతి భవన్ గేట్లను ఇంకా చెప్పాలంటే గడీ గేట్లను సామాన్యుల కోసం బద్దలు కొట్టింది.

ప్రజలకు ఉపయోగపడని, ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ బద్దలు కొడితే తప్పేంటని ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ప్రగతి భవన్ ఏ ఒక్కరి సొంతమో కాదు.. అందరిదీ. ఇది ప్రజల ఆస్తి అని చెప్పేశారు. గత పదేళ్ల మాదిరి పాలన ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. ప్రమాణస్వీకారం రోజే ప్రగతి భవన్ ఇనుప కంచెను బద్దలు కొట్టామని చెప్పడం ద్వారా తానేంటో మరోసారి చాటి చెప్పారు.

రేవంత్ రెడ్డి వ్యక్తి కాదు.. శక్తి అని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా అసలైన బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. ఎవరికి వారే ఉండే కాంగ్రెస్ లాంటి పార్టీలో ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ కాదు. స్వపక్షంలోనే విపక్షం అన్న నానుడి ఉండనే ఉంది. ఇలా స్వపక్షాన్ని, అటు ప్రజలను సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకోవాలి.. అందరినీ మెప్పించాలి. సీఎం రేవంత్ రెడ్డి ముందు మల్టీ టాస్క్ ఉంది. ప్రచారంలో ఎలాగైతే… ఆపరేషషన్ P.C.C.E. అంటే… పాలసీ, కాలిక్యులేషన్, కమ్యూనికేషన్, ఎగ్జిక్యూషన్ చేశారో.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎలక్షన్లకు ముందు డిక్లరేషన్ల రూపంలో కాంగ్రెస్ పాలసీని జనంలో చర్చకు పెట్టారు. ఆ తర్వాత ఏయే వర్గాలు ఓట్లు వేస్తే అధికారంలోకి వస్తాం… ఎన్ని ఓట్లు రావాలి అన్నది కాలిక్యులేషన్ చేసుకున్నారు. పార్టీలో కమ్యూనికేషన్ సమన్వయం సాధించేలా చూసుకున్నారు. ఫైనల్ గా పోలింగ్ కు ముందు వీటన్నిటినీ సక్సెస్ ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు రేవంత్. అందుకే విజయం దక్కింది. ఇప్పుడు పాలనలోనూ ఇలాంటివే ఫాలో అవడం ఖాయం.

కచ్చితత్వం సీఎం రేవంత్ సొంతం. అందుకే 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఒక పార్టీలో చేరిన ఆరేళ్లలోనే రాజదండం అందుకునేంత ఎత్తుకు చేరారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే సవాళ్ల సవారీనే. అలాంటి సవాళ్లను ఎన్నో తన జీవితంలో చూశారు రేవంత్. పీసీసీ అధ్యక్షుడిగా నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా నిరూపించుకునే మహత్తర అవకాశం సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంది.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×