EPAPER

CM Revanth Reddy: ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Key Comments: ఉద్యోగుల కళ్లల్లో సంతోషం చూడాలనే దసరా కంటే ముందే నియామక పత్రాలు ఇస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శిల్పాకళావేదికలో ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.


‘ఆనాటి ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులను పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఎంతో కాలం ఎదురు చూసి ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయారు. 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. ఉద్యోగుల కళ్లల్లో సంతోషం చూడాలనే దసరా కంటే ముందే నియామక పత్రాలు ఇస్తున్నాం. 1635 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉంది. మీ చప్పట్లలో మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల ఆనందం కనిపిస్తుంది. ఏళ్లుగా నిరీక్షించిన మీ కల ఇవాళ సాకారమవుతోంది. వందలాది మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. అలాంటి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు.

Also Read: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..


ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. ఇది భావోద్వేగం. ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. లక్షలాది మంది హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లను మీరు ఆదర్శంగా తీసుకోవాలి. హైదరాబాద్ లో వందల ఏళ్ల క్రితం నిర్మించిన అద్భుత కట్టడాలున్నాయి. వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు. కాళేశ్వరం కట్టినవారిని ఆదర్శంగా తీసుకుంటారో… నాగార్జున సాగర్ కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఆలోచించుకోండి. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ఒకే విధంగా వ్యవహరించండి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మీ అందరిపై ఉంది’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

‘తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచుకున్న కేసీఆర్.. 2015లో నోటిఫికేషన్లు ఇచ్చినా వాళ్లకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని.. విద్యార్థి నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్ కవచంగా మార్చుకున్నారు. ఇవాళ ముసుగు తొలగిపోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అక్టోబర్ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇది మా చిత్తశుద్ధి.. ఇది మా బాధ్యత.

టెక్నాలజీ లేని సమయంలోనే పెద్ద ప్రాజెక్టులు కట్టుకున్నాం. కాళేశ్వరం మీరే కట్టారు.. మీ కళ్ల ముందే కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటికీ డీపీఆర్ లేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం కట్టినవారిని ఆదర్శంగా తీసుకుంటారా? లేక కాళేశ్వరం కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారా? కాళేశ్వరం మీరే కట్టారు… మీరున్నప్పుడే కూలిపోయింది. వందేళ్ల అనుభవం ఒకవైపు ఉంటే.. పదేళ్ల దుర్మార్గం మరో వైపు ఉంది.

Also Read: కేసీఆర్ కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఫిర్యాదు చేసింది ఎవరంటే ?

తెలంగాణ ఉద్యమం అనే ముసుగు వేసుకుని గత పదేళ్లు నేను గొప్ప అని అనుకున్నారు. కేసీఆర్ కు ఉన్న ముసుగు తొలగిపోయింది. మూసీని ప్రక్షాళన చేయొద్దా?. మూసీ నిర్వాసితులు బాగుపడొద్దా? మూసీ దుర్గంధం మధ్యలోనే అక్కడి వాళ్లు బతకాలా? మూసీ పరివాహక ప్రజలకు ఇండ్లు కట్టించి వారికి మంచి భవిష్యత్తును అందిద్దాం. ఎవరు అడ్డు వచ్చినా మూసీ రివర్ ఫ్రంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం’ అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

‘ముందురోజు కేసీఆర్, హరీశ్ రావు మాట్లాడితే.. ఆ తరువాత ఈటల వచ్చి మాట్లాడుతారు. మెడపట్టి గెంటేసిన దొంగల పక్కనే ఈటల నిలబడుతున్నారు. ప్రతీదానికి అడ్డుపడటం కాదు.. మూసీ బాధితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి. ఈటల అంగి మారింది కానీ.. వాసన మారలేదు. హరీష్, కేటీఆర్ మాట్లాడిందే ఈటల మాట్లాడుతున్నారు. ఈటల ఇప్పటికైనా పేదల వైపు నిలబడాలి. ఇలా వచ్చి అలా వెళ్లడం కాదు… ధైర్యం ఉంటే కేసీఆర్, హరీష్, ఈటల మూసీ పరివాహక నివాసాల్లో వారం రోజులు ఉండండి. వాళ్ల కష్టాలు, బాధలు తెలుస్తాయి’ అంటూ సీఎం హెచ్చరించారు.

Related News

Telangana Cabinet: దసరాలోపే కేబినెట్ విస్తరణ.. కొండా సురేఖ ఔటా..?

Appointments: దసరా వేళ సంతోషంలో కాంగ్రెస్ కేడర్.. త్వరలోనే మరిన్ని..

Etela: సీఎం రేవంత్ రెడ్డికి ఈటల లేఖ.. హైడ్రాకు వ్యతిరేకం కాదంటూ…

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

Ponguleti: త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి

Derogatory Comments: బూతులపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు సేవ చేయడంపై లేదా..?

×