EPAPER

CM Revanth Reddy: విద్యకు 10 నుంచి 12 శాతం నిధులిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ..

CM Revanth Reddy: విద్యకు 10 నుంచి 12 శాతం నిధులిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ..
revanth reddy latest news

CM Revanth Reddy handed over appointment papers to Gurukula teachers(Latest news in telangana): ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయ, లైబ్రేరియన్స్ కు నియామకపత్రాలును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగ నియామకాల్లో గత ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.


Latest news in telangana

రాష్ట్ర ప్రజలు అన్యాయాలను గుర్తించి బీఆర్ఎస్ ని గద్దె దించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యానికి మళ్లీ ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు.

బీఆర్ఎస్ లో కుటుంబం ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని గతంలోనే చెప్పామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు మీకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. 567 గ్రూప్-1 పోస్టులకు సంబంధించి అనుమతి ఇచ్చామన్నారు. ఇటీవలే గ్రూప్‌-4 ఫలితాలు విడుదల చేశామని సీఎం అన్నారు.


3650 రోజులు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సమయం దొరకలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దోచుకున్నది.. దాచుకోవడంపైనే ఆయన దృష్టిపెట్టారు. మేడిగడ్డ పేక మేడలా కూలిపోయే పరిస్థితి నెలకొందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై రూ.1.81లక్షల కోట్లు ఖర్చు పెట్టారు కానీ లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదన్నారు.

Read More: హరీష్ రావు కి కోమటిరెడ్డి బిగ్ ఆఫర్.. ఏంటంటే..?

కాగ్‌ నివేదికను సభలో పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులపై చర్చ పెడితే అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ పారిపోయారన్నారు. హరీష్ రావు అధికారమిస్తే చేసి చూపిస్తానంటున్నారన్నారు. పదవి రావాలంటే ఆయన మరో ఔరంగ జేబు అవాతరం ఎత్తాల్సిందేననన్నారు.

త్వరలో గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉద్యోగ నియామకాల చిక్కుముడులు విప్పుతున్నామన్నారు. అధికారం చేపట్టిన 70 రోజుల్లోనే దాదాపు 25వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం విద్యపై ఖర్చు చేసింది కేవలం 6శాతం మాత్రమేనన్నారు. దాన్ని 10 నుంచి 12శాతానికి పెంచి గురుకుల పాఠశాలలను బలోపేతం చేస్తామని సీఎం తెలిపారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×