EPAPER

CM Revanthreddy: ఢిల్లీకి సీఎం రేవంత్, పార్టీలో మార్పులు చేర్పులు!

CM Revanthreddy: ఢిల్లీకి సీఎం రేవంత్, పార్టీలో మార్పులు చేర్పులు!

CM Revanthreddy: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరును సమీక్షిం చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు.  గురువారం సాయంత్రం లేదా శుక్రవారం వెళ్లనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ హైకమాండ్‌తో వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించే అవకాశముంది.


వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటినుంచే స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలో పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే చాలామందిని మార్చింది హైకమాండ్. ఇక పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఢిల్లీకి రావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కబురు పెట్టింది. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి హస్తినకు వెళ్లనున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. శుక్రవారం జరగనున్న ఏఐసీసీ సమావేశానికి ఈ నేతలు హాజరవుతారు. తెలంగాణ పార్టీ చీఫ్ ఎన్నిక, మంత్రివర్గ విస్తరణపై సంబంధించి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలతో చర్చలు జరపనున్నారు సీఎం రేవంత్.


ALSO READ: స్పీడు పెంచండి..: రీజనల్ రింగ్ రోడ్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి

ఏఐసీసీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ను బెంగాల్‌కు పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో ఛత్తీస్‌ఘడ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌ను నియమించే అవకాశమున్నట్లు ఢిల్లీ సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అభిప్రాయాలను ఏఐసీసీ తీసుకోనుంది.

టీపీసీసీ రేసులో నలుగురు నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ నుంచి మధుయాష్కీ గౌడ్, ఎస్సీ నుంచి సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్టీ నుంచి బలరాం నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఈసారి రేవంత్ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ నాయకులు బలంగా చెబుతున్నారు. నలుగురికి పదవులు వచ్చే అవకాశమున్నట్లు ఢిల్లీ సమాచారం. మంత్రి పదవుల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూ నాయక్, రామ్మోహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్‌ రావు, గడ్డం వివేక్, సుదర్శన్‌రెడ్డి, వాకాటి శ్రీహరి రేసులో ఉన్నారు. వీరిలో అదృష్టం ఎవరికి వరిస్తుందో చూడాలి.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×