EPAPER

CM Revanth Reddy: మొన్న పథకాలు.. నిన్న ఉద్యోగాల జాతర.. నేడు పెట్టుబడుల సాధన.. ఇదీ సీఎం రేవంత్ మార్క్ పాలన

CM Revanth Reddy: మొన్న పథకాలు.. నిన్న ఉద్యోగాల జాతర.. నేడు పెట్టుబడుల సాధన.. ఇదీ సీఎం రేవంత్ మార్క్ పాలన

CM Revanth Reddy: మొన్న పథకాలు.. నిన్న ఉద్యోగాల జాతర.. నేడు రాష్ట్రానికి పెట్టుబడుల సాధన.. ఇలా ఓ వైపు ప్రజా సంక్షేమం, మరో వైపు రాష్ట్రాభివృద్ది దిశగా.. తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతోంది. దసరా పండుగకు స్వగ్రామానికి వెళ్లి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నిమిషం ఖాళీ లేకుండా.. మళ్లీ పాలనపై దృష్టి సారించారు. ఈసారి తన గురి రాష్ట్రానికి పెట్టుబడుల సాధనపై ఎక్కుపెట్టారు.


తెలంగాణ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల హామీతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్.. పాలనా పగ్గాలు చేపట్టగానే హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక్కొక్క హామీ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మహిళలకు ఫ్రీ బస్, గృహ జ్యోతి, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ గృహాలు, ఇలా హామీలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తోందన్నది ప్రజా అభిప్రాయం.

అంతేకాదు ఇటీవల ఉద్యోగాల జాతర సాగించింది రేవంత్ సర్కార్. డీఎస్సీ నోటిఫికేషన్ తో 11 వేల మందికి ఉద్యోగ ఉపాధ్యాయ నియామక పత్రాలు, ఏఈఈ పోస్టుల భర్తీ, సింగరేణిలో కారుణ్య నియామకాలు, ఇలా పలు ఉద్యోగాల భర్తీ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనితో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు నెరవేరాయి. అయితే తాజాగా సీఎం రేవంత్ పెట్టుబడుల సాధనపై దృష్టి సారించారు. అందులో భాగంగా సోమవారం హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు సందర్శించారు.


ఈ సంధర్భంగా ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమై కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి, ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ.. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పించడంలో అన్ని విధాలుగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ఫాక్స్ కాన్ ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు.

ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం వెంట ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ విభాగం ఉన్నతాధికారులు, ఫాక్స్‌కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: MLA Mallareddy: మనసులోని మాటకు.. సమయం ఆసన్నమైందా.. ఇంతకు మల్లారెడ్డి మదిలో ఏముంది ?

దీనితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ప్రతి సంస్థకు తాము అన్ని రకాలుగా సహకరిస్తామని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు రాష్ట్రానికి పెట్టుబడుల రాక ఎంతో అవసరమనే రీతిలో సీఎం ప్రసంగం సాగింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాలపై దృష్టిసారించిన సీఎం.. ఇక పెట్టుబడుల సాధనపై గురి పెట్టడం ఆనందించదగ్గ విషయమంటున్నారు యువత. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి.. సీఎం అనుకున్న లక్ష్యం నెరవేరి.. ఉపాధి మార్గం యువతకు చూపాలని అందరం ఆశిద్దాం.

Related News

Brs Approved For Radar Station : అప్పట్లోనే రాడార్ స్టేషన్’కు బీఆర్ఎస్ అనుమతి… ఇప్పుడేమో ?

Gaddar Awards: మన సినీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసించాలి, గద్దర్ అవార్డుల భేటీలో భట్టి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: ఆలయంపై దాడి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

Telangana Caste Census : కులగణనకు లైన్ క్లియర్.. జనవరిలో స్థానిక ఎన్నికలకు పచ్చజెండా

TPCC President Mahesh Goud : పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు : మహేశ్ కుమార్ గౌడ్

Sahiti Infra Case: సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఈడీ దూకుడు.. ఉక్కిరిబిక్కిరవుతున్న లక్ష్మినారాయణ

Big Stories

×