EPAPER

Yadadri: మన గుట్ట మెరవాలి..!

Yadadri: మన గుట్ట మెరవాలి..!

– యాదగిరి గుట్టకు మరింత గుర్తింపు
– భక్తుల సౌకర్యాల్లో కొరత రావద్దు
– రాజగోపురానికి బంగారు తాపడం
– టీటీడీ తరహా టెంపుల్ బోర్డు ఏర్పాటు
– కొత్త టూరిజం పాలసీకి ఆదేశాలు
– హెల్త్, హెలీ, ఎకో టూరిజం పెరగాలి
– రాజధాని బయట మరో కొత్త జూపార్క్
– స్పీడ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి


CM Revanth Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా యాదగిరి గుట్ట దేవస్థానానికీ తమ ప్రభుత్వం ఒక పాలకమండలిని ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ఏర్పాటు చేసిన స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎపెక్టివ్ డెలివరీ (స్పీడ్) 19 ప్రాజెక్టుల యాక్షన్ ప్లాన్ మీద సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలున్న నేపథ్యంలో సంప్రదాయ టూరిజంతో బాటు ఎకో, హెలీ టూరిజం అభివృద్ధి మీద అధికారులు దృష్టి సారించాలని, దీనికోసం నూతన టూరిజం పాలసీని రూపకల్పన చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షకు సీఎస్ శాంతికుమారితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై సీఎం ఈ సందర్భంగా చర్చించారు.

టీటీడీ తరహా బోర్టు
యాదగిరిగుట్ట అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆలయానికి అన్ని విధాలా గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆలయానికి సంబంధించిన పెండింగ్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్ట్యా ఆలయంలో చేపట్టాల్సిన ఏర్పాట్లమీద వివరాలతో కూడిన నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని, పెండింగ్ పనులను అర్ధాంతరంగా వదిలేయడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాలన్నారు.


టూరిజం పాలసీ…
స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా సీఎం కొత్త టూరిజం పాలసీ అవసరాన్ని సీఎం వివరించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అనేక అవకాశాలున్నా.. వాటిని సమర్థవంతంగా అందిపుచ్చుకోలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెలీ టూరిజం వంటి అంశాలనూ కొత్త టూరిజం పాలసీలో భాగంగా చేయాలని అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ టూరిజం పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న నాల్గవ నగరంలో హెల్త్ హబ్‌ రానుందని, దీనివల్ల విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో రానున్న రోజుల్లో హైదరాబాద్ రానున్నారని, కనుక నూతన టూరిజం పాలసీ రూపకల్పనలో హెల్త్ టూరిజానికీ సముచిత స్థానం కల్పించాలన్నారు. హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం పేర్కొన్నారు. దీనికోసం పీపీపీ విధానాన్ని అవలంభించాలని సలహా ఇచ్చారు.

Also Read: Rare Mosquito Disease: దోమల వల్ల ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి.. మనమూ జాగ్రత్తగా ఉండాల్సిందేనా ?

సీఎంకు వేములవాడ అర్చకుల ఆశీర్వచనం
వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ. 50 కోట్లు కేటాయించిన నేపథ్యంలో శుక్రవారం సీఎం రేంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు. రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలు, నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవలసి ఉందని వివరించగా, వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. ఈ భేటీలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ ఇతర ముఖ్యులు ఉన్నారు.

ముస్లిం మత పెద్దలతో చర్చలు..
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకునే మిలాద్ ఉన్ నబీ పండుగ ఏర్పాట్లపై గురువారం రాత్రి సీఎం మతపెద్దలతో చర్చించారు. ఈ ఏడాది సెప్టెంబరు 16 న పండుగ వస్తుందని, కానీ, సెప్టెంబరు 17న గణేశ నిమజ్జనం ఉన్నందున, మిలాద్ ఉన్ నబీ పండుగ ఊరేగింపులను సెప్టెంబర్ 19న జరుపుకోవాలని సీఎం వారిని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. అయితే వచ్చే ఏడాది మహమ్మద్ ప్రవక్త 1500 జన్మదినం ఉండటంతో సంవత్సరం మొత్తం వేడుకలకు అనుమతి ఇవ్వాలని సీఎంను కమిటీ కోరింది. నిబంధల ప్రకారం అనుమతిని పరిశీలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×