CM Revanth Reddy: ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది ఆ యువతి. కానీ, ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేదు. ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోన్న ఆ గిరిజన బాలికకు రేవంత్ సర్కార్ ఆర్థిక సాయం అందించింది.
కుమురం భీం జిల్లాకు చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ డాక్టర్ కావాలన్నది కోరిక. నీట్‌లో ఎస్టీ విభాగంలో 103 వ ర్యాంకు సాధించింది. మంచి ర్యాంకుతో సీటు సాధించినా ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతోంది.
యువతికి డాక్టర్ కావాలనే కోరికైతే బలంగా ఉంది కానీ, ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. ఈ విషయం చివరకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వచ్చింది. ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఆర్ధిక సాయం అందజేసింది.
సాయిశ్రద్ధ, ఆమె తల్లిదండ్రులు బుధవారం ముఖ్యమంత్రిని కలిశారు. వైద్య విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. వైద్య విద్య పూర్తి చేయాలన్న కల నెరవేరుతున్నందుకు ఈ సందర్భంగా సాయిశ్రద్ధ, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు. డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుందని రాసుకొచ్చారు.
ఎంబీబీఎస్ లో సీటు సాధించి ఫీజు కట్టే ఆర్ధిక స్తోమత లేక ఇబ్బంది పడుతోన్న కుమురం భీం జిల్లా,జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ విషయం…
నిన్ననే నా దృష్టికి వచ్చింది.డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ… pic.twitter.com/DPvPs3wEXO
— Revanth Reddy (@revanth_anumula) October 30, 2024