EPAPER
Kirrak Couples Episode 1

CM Revanth Reddy Delhi Tour : పారిశ్రామిక కారిడార్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి..

CM Revanth Reddy Delhi Tour : పారిశ్రామిక కారిడార్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి..

CM Revanth Reddy Delhi Tour : హైద‌రాబాద్-విజయవాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర ప్ర‌భుత్వం తుది అనుమ‌తులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమ‌తులు మంజూరు చేస్తే రాష్ట్రానికి 2వేల 300 కోట్లు విడుద‌లవుతాయ‌న్నారు. పీయూష్ గోయ‌ల్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఆయ‌న కార్యాల‌యంలో స‌మావేశ‌మై రాష్ట్రానికి సంబంధించిన ప‌లు స‌మ‌స్య‌ల‌ను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.


హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌లో ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గ‌త ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింద‌ని, దానిని ఉప సంహ‌రించుకొని నూత‌న ప్ర‌తిపాద‌న‌లు పంపేందుకు అనుమ‌తించాల‌ని కేంద్రమంత్రిని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో హైద‌రాబాద్‌కు నేష‌న‌ల్ డిజైన్ సెంట‌ర్ మంజూరైందని, నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శ‌ర్మ దానికి శంకుస్థాప‌న చేశార‌ని గోయ‌ల్‌కు సీఎం గుర్తు చేశారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఎన్ఐడీని విజ‌య‌వాడ‌కు త‌ర‌లించార‌ని, ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌కు ఎన్ఐడీ మంజూరు చేయాల‌ని కోరారు. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెద‌ర్ పార్క్ మంజూరు చేసింద‌ని కేంద్రమంత్రితో ముఖ్య‌మంత్రి అన్నారు. క‌రీంన‌గ‌ర్‌, జ‌న‌గాం జిల్లాల్లో లెద‌ర్ పార్క్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూములున్నాయ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం మెగా లెద‌ర్ పార్క్ మంజూరు చేస్తే వెంట‌నే భూమి కేటాయిస్తామ‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి తెలిపారు.


బ్రౌన్‌ఫీల్డ్ నుంచి గ్రీన్ ఫీల్డ్‌కు మార్చితే లెదర్‌ పార్క్‌కు గ్రాంట్ల రూపంలో అద‌నంగా మూడు వందల కోట్ల నిధులు వ‌స్తాయ‌ని, ఇది అక్క‌డి ప‌రిశ్ర‌మ‌ల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. టెక్నిక‌ల్ టెక్స్ టైల్స్ టెస్టింగ్ సెంట‌ర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌న్నారు. ఈ విష‌యంలో తెలంగాణ ఇప్ప‌టికే సంసిద్ధ‌త వ్య‌క్తం చేసినందున రాష్ట్రానికి టెస్టింగ్ సెంట‌ర్ మంజూరు చేయాల‌ని కోరారు.

.

.

Related News

Bigg Boss 8 Day 21 Promo: గెస్ ది సౌండ్ .. కొత్త టాస్క్ తో తికమక పెట్టించిన బిగ్ బాస్..!

Jani Master: నువ్వు మామూలోడివి కాదయ్యో.. ఇంతమందిపై లైం*గి*క దాడా..?

Bigg Boss 8 Day 21 Promo: సెట్ ఆర్ కట్.. రియల్ ఫన్ డే అయ్యిందిగా..?

Bigg Boss: పోటీ లేదు.. టీఆర్పీ రేటింగ్ రాదు.. ఆ తప్పే రిపీట్ కానుందా..?

Kalki Sequel: కల్కి సీక్వెల్ పై అభిమానులలో టెన్షన్.. అసలు కారణం ఏంటంటే..?

Heroine Simran: వారు క్షమాపణ చెప్పాలి.. బహిరంగ ప్రకటన చేసిన సిమ్రాన్..!

R.K.Roja: జానీ మాస్టర్ పై షాకింగ్ కామెంట్.. నిజం తేల్చాలంటూ..?

Big Stories

×