EPAPER

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, ఈ రెండు పనుల కోసం కూడా..

CM Revanth Reddy:  ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, ఈ రెండు పనుల కోసం కూడా..

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేడో రేపో ఢిల్లీకి వెళ్లనున్నారు. కొత్త పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించనున్నారు. పనిలోపనిగా వరంగల్‌లో జరగనున్న రైతు కృతజ్ఞత సభకు సోనియాగాంధీ, రాహుల్‌లను ఆహ్వానించనున్నారు.


గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ టూర్‌లో భాగంగా రీసెంట్‌గా అమెరికా, కొరియా టూర్లలో పారిశ్రామిక వేత్తలతో చర్చించిన విషయాలను వివరించారు. పని లోపనిగా పెండింగ్‌లో ఉన్న నూతన పీసీసీ చీఫ్‌తోపాటు మంత్రివర్గ విస్తరణపై ఆయన దృష్టి సారించ నున్నారు.

తొలుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కొన్నాళ్లుగా పీసీసీ పదవిని కొత్త వ్యక్తి ఎంపిక పెండింగ్‌లో పడింది. కొద్దిరోజులుగా పార్టీ హైకమాండ్.. ఈ వ్యవహారంపై రాష్ట్ర నేతలలతో చర్చలు జరుగుతోంది. అయితే తెలంగాణ ఎక్కువమంది నేతలు రేసులో ఉండడంతో ఎవరికి ఇవ్వాలనే దానిపై కొంత సస్పెన్స్ నెలకొంది. ఈ రేసులో రెడ్డి సామాజికవర్గం పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ, ఎస్టీ, ఎస్సీలకు చెందిన నేతలైన మధుయాష్కీగౌడ్, మహేష్‌కుమార్, బలరాం నాయక్, సంపత్ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.


ALSO READ:  తొలిసారి గొల్కొండ కోటపై సీఎం రేవంత్‌రెడ్డి స్పీచ్, కీలక పాయింట్లు వెల్లడి..

ఫైనల్‌గా సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం తీసుకున్నాక, కొత్త అధ్యక్షుడ్ని ప్రకటించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రేవంత్ తన కేబినెట్‌ని విస్తరించే పనిలోపడ్డారు. దీనిపై గతంలో మంత్రులు తమ అభిప్రాయాలను బయటపెట్టారు. ఈసారి కేబినెట్‌లో తమ పదవులు మారుతున్నట్లు కొందరు చెప్పారు.

మంత్రి పదవులను ఆశిస్తున్నవారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వాకాటి శ్రీహరి, బాలునాయక్, సుదర్శన్‌ రెడ్డి, ప్రేమసాగర్‌రావు, జి. వివేక్ వంటి నేతలున్నారు. ఖాళీగా ఉన్న బెర్తులతోపాటు మైనార్టీలకు ఈసారి స్థానం కల్పిస్తారని చెబుతున్నారు నేతలు. ప్రస్తుతం ఐదారు బెర్తులు ఖాళీ ఉండగా, కనీసం నాలుగు ఖరారయ్యే అవకాశముందని సమాచారం.

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు, ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై పార్టీ ముఖ్యనేతలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. పెండింగ్‌లో వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, నామినేటెడ్ పోస్టులకు ఈసారి గ్రీన్ సిగ్నల్ వస్తుందని నేతలు భావిస్తున్నారు. ఎస్టీ, ఎస్సీ కమిషన్ల ఛైర్మన్లు, డిప్యూటీ స్పీకర్ పదవుల  గురించి చర్చిస్తారని పార్టీలోని ఓ కీలక నేత చెప్పారు.

రైతు కమిషన్ ఛైర్మన్ పదవికి కోదండరెడ్డి రేసులో ఉన్నట్లు వార్తలు లేకపోలేదు. రాజీవ్‌గాంధీ విగ్రహం ఆవిష్కరణతోపాటు వరంగల్‌లో జరగనున్న రైతు కృతజ్ఞత సభకు అగ్రనేతలను ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×