EPAPER

Cognizant: తెలంగాణను 1 బిలియన్ ఎకనామీకి చేర్చడమే నా విజన్ : సీఎం రేవంత్ రెడ్డి

Cognizant: తెలంగాణను 1 బిలియన్ ఎకనామీకి చేర్చడమే నా విజన్ : సీఎం రేవంత్ రెడ్డి

Cognizant: తెలంగాణను 1 బిలియన్ ఎకనామీకి చేర్చడమే తన విజన్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోకాపేటలో కాగ్నిజెంట్ శంఖుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమెరికా, దక్షిణ కొరియా 10 రోజుల పర్యటన తరువాత ఈరోజే తిరిగి వచ్చాం. అమెరికా, కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పొరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ పర్యటన ద్వారా రూ. 31,500 కోట్ల పెట్టుబడులు, 30 వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయనే సంగతి మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని, పెట్టుబడులకు సంబంధించినటువంటి సమావేశాల నిర్వహణకు ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తాం. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ. రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి.. మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్.


రెండోది సెమీ అర్భన్ ఏరియా.. ఇక్కడ మేం తయారీ కేంద్రా ఏర్పాటు చేయబోతున్నాం. మూడవది రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్ తెలంగాణ. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ్ అక్కడి గ్రామాలను అభివృద్ధి చేస్తాం. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం. కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చా. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి పునాది పడింది. ఆ తరువాత చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ అభివృద్ధిని కొనసాగిస్తూ వచ్చారు. సైబరాబాద్ సిటీని అభివృద్ధి చేశారు.

Also Read: రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త.. స్టేషన్లలో ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో పేమెంట్స్


హైదరాబాద్ మాదిరిగా కాగ్నిజెంట్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ కు గుర్తింపు ఉంది. రాజకీయంగా ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మాదిరిగా ఫోర్త్ సిటీ.. ప్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. మా చిత్త శుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే మీకు నిరూపిస్తది. మా పోటీ ఏపీ, కర్ణాటకతోనే కాదు.. మా పోటీ ప్రపంచం తోనే. హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రాంతం. అందువల్ల పారిశ్రామిక వేత్తలకు ఈ వేదిక నుంచి పిలుపు ఇస్తున్నా. రండి పెట్టుబడులు పెట్టండి. మీకు కావాల్సిన సౌకర్యాలను మేం కల్పిస్తాం’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×