EPAPER

CM Revanth Reddy: ‘అబద్దాల బడ్జెట్ కాదు.. మాది వాస్తవిక బడ్జెట్’

CM Revanth Reddy: ‘అబద్దాల బడ్జెట్ కాదు.. మాది వాస్తవిక బడ్జెట్’
CM Revanth Reddy latest news

CM Revanth Reddy latest news(Political news today telangana): గత ప్రభుత్వం లాగా తాము అబద్ధాల బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టామన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తామన్నారు. విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తమ పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకువస్తే కలిసివెళ్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ఆయన్నే అడగాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

తెలంగాణలో రైతు బంధును అర్హులైన రైతులకు అందేలా చూస్తామని సీఎం రేవంత్ అన్నారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమన్నారు. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. వాస్తవాలకు దగ్గరగానే బడ్జెట్ ను ప్రవేశపెట్టామన్నారు. అబద్దాలు చెపితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సంవత్సరం అంతా అబద్దాలు చెప్పాల్సి ఉంటుందన్నారు.


Read More: ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి..

కేసీఆర్ కు పదేళ్లు అధికారంలో ఉన్నా బడ్జెట్ ను అంచనా వేయడం రాలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించినందుకు మంత్రి భట్టి విక్రమార్కకు సీఎం అభినందనలు తెలిపారు. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మిత్తి కట్టలేకనే రైతులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారన్నారు.

కమీషన్ల కోసం టెండర్లు పిలిస్తే గత ప్రభుత్వం లాగే అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ బరాబర్ రద్దు చేస్తామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తప్పకుండా రాబడతామన్నారు సీఎం పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రొసీజర్ అంతా స్పీకర్ చూస్తారన్నారు. ఎమ్మెల్సీలకు క్షమాపణ చెప్పే అంశం సభా అధికారులు చూసుకుంటారన్నారు. తెలంగాణ భాష ఇలాగే ఉంటుందన్నారు.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై అన్ని విధాలుగా విచారణ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమరవీరుల స్థూపం, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణాలపై విచారణ జరిపిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ జరిపామని పేర్కొన్నారు. జ్యుడిషియల్ విచారణలో అసలు విషయాలు తెలుస్తాయన్నారు. మేడిగడ్డకు వెళ్దామని ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించానని చెప్పిన సీఎం తెలిపారు. 13వ తేదీన బీఆర్ఎస్ వాళ్లకు మీటింగ్ ఉంటే వేరే తేదీ చెప్పినా తాము ఆలోచిస్తామన్నారు. ఒకరోజు ముందు లేదా వెనుక వెళదాం అన్నా తాము సిద్ధంగా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×