EPAPER

TG Govt: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఆ రైతన్నలకు రూ.500 బోనస్.. 48 గంటల్లో డబ్బు జమ

TG Govt: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఆ రైతన్నలకు రూ.500 బోనస్.. 48 గంటల్లో డబ్బు జమ

Good News: తెలంగాణ రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తమది రైతు ప్రభుత్వం అంటూ మరోమారు సీఎం రేవంత్ నిరూపించుకున్నారని, సీఎం ప్రకటన పట్ల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరి సాగు చేసిన రైతన్నల నుండి ధాన్యం సేకరణపై దృష్టి సారించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు వరాలు ప్రకటించింది. ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.


ఈ సంధర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. సీఎం మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటే సహించే ప్రసక్తే లేదన్నారు. రైతన్నలకు తాము ఇచ్చిన మాట ప్రకారం.. ఈ సీజన్ నుండే సన్నాలకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ ను ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం రేవంత్ అన్నారు.


ధాన్యం అమ్మిన ప్రతి రైతుకు 48 గంటల్లోపే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, ఖచ్చితంగా అందుకు తగ్గ కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. ప్రస్తుత సీజన్ లో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పగా, అవసరమైన చోట కలెక్టర్లు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారని, అందుకై కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు, తప్పులు జరగకుండా జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు.

Also Read: Rain Alert: రేపటి నుండి వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలలో మాత్రం అంతంత మాత్రమే.. మరికొన్ని జిల్లాలలో..

ప్రతి కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించి, ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నెంబర్ తప్పకుండా వేయాలని, తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించరాదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ధాన్యం సేకరణ ప్రక్రియలో పాల్గొనాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి పౌర సరఫరాల శాఖ విభాగంలో 24X7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఇప్పటికే రుణమాఫీ అమలు చేసిన ప్రభుత్వం.. రైతన్నల వద్ద ధాన్యం కొనుగోలు విషయంపై గుడ్ న్యూస్ చెప్పడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ధాన్యం సేకరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Related News

Kondakal: కొండకల్ తండాలో ఏం జరుగుతోంది..? ‘స్వేచ్ఛ’ వార్తలతో విషయం వెలుగులోకి..

Minister Sridharbabu: వాళ్లతో నష్టపోవడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు: మంత్రి శ్రీధర్ బాబు

Rain Alert: రేపటి నుండి వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలలో మాత్రం అంతంత మాత్రమే.. మరికొన్ని జిల్లాలలో..

Harishrao: ఆరునూరైనా అడ్డుకుని తీరుతా.. అవసరమైతే అక్కడికి కూడా వెళ్తా: హరీష్ రావు

Tummala: మోసగాళ్ల మాటలు నమ్మొద్దు.. రైతు భరోసా ఆగదు: మంత్రి తుమ్మల

CM Revanth Reddy: నిఖత్ జరీన్ ప్రయాణం మనకు స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్

Big Stories

×