EPAPER

CM Revanth Reddy: ఎన్ని అడ్డంకులు వచ్చినా.. రైజింగ్ తెలంగాణ.. రైజింగ్ హైదరాబాద్.. ఇదే నా లక్ష్యం.. సీఎం రేవంత్

CM Revanth Reddy: ఎన్ని అడ్డంకులు వచ్చినా.. రైజింగ్ తెలంగాణ.. రైజింగ్ హైదరాబాద్.. ఇదే నా లక్ష్యం.. సీఎం రేవంత్

CM Revanth Reddy: యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను… రైజింగ్ తెలంగాణగా, రైజింగ్ హైదరాబాద్‌గా తీర్చిద్దడమే తన లక్ష్యంగా ఎంచుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతో మంది యువకుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని, రాష్ట్ర ప్రగతి విషయంలో కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, హైదరాబాద్ లో ఒక మీడియా సంస్థ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో దేశంలో అభివృద్ధి కోసం భాక్రానంగల్ నుంచి, నాగార్జున సాగర్ వరకు ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యావ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. సౌత్ స్టేట్స్ కు ప్రధాని మోడీ అందించిన సహకారం చాలా తక్కువగా ఉందన్న సీఎం, దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం పెద్దగా నిధులు ఇవ్వకపోయినా ఇక్కడి ఓట్లు కావాలని ఎలా అడుగుతారంటూ సీఎం ప్రశ్నించారు. నార్త్ స్టేట్స్ తో పోలిస్తే సౌత్ స్టేట్స్ ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నా వాటిలో తిరిగి పొందేది మాత్రం చాలా తక్కువగా ఉందన్నారు. కేంద్రానికి మేం ఒక్క రూపాయి పంపిస్తే కేవలం రూ.40 పైసలు మాత్రమే తిరిగి వెనక్కి వస్తున్నాయని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానిస్తున్నా నిధుల విషయంలో మాత్రం వివక్ష జరుగుతూనే ఉందని, దీనికి కారణంగా ప్రధాని మోడీ ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తి కావటమేనంటూ సీఎం విమర్శించారు.

ఇక హైదరాబాద్ అభివృద్దిపై సీఎం మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నామని, గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలా… బాపూ ఘాట్ లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రసంగించారు. మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోందని, దీన్ని బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు.


Also Read: Shamshabad Airport Bomb Threat: విమానాలకు వదలని బెదిరింపు కాల్స్.. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు.. తనిఖీ చేస్తున్న పోలీసులు

మాజీ సీఎం కేసీఆర్ గురించి సీఎం మాట్లాడుతూ.. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన గత సీఎం కేసీఆర్ పది సార్లు కూడా సెక్రటేరియట్ కు రాలేదని, ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారన్నారు. కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎందుకు బయటకు రావడం లేదని, కేసీఆర్ ఆయనకు ఆయనే ఫ్రీడం ఫైటర్ అని చెప్పుకుంటారని విమర్శించారు. తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలు ఎన్నుకుంటేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, మీకు నచ్చకుంటే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వాన్ని పని చేయనివ్వండంటూ సీఎం కోరారు. తమ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు అంతా గమనిస్తున్నారని, పార్లమెట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేసీఆర్ ప్రజల ఆలోచనను అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ప్రజల ఆలోచనను పట్టించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని సీఎం జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సర్కార్ ను పడగొట్టాలని అనుకున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Related News

KTR challenges Revanth: లైడిటెక్టర్ టెస్టులకు నేను రెడీ.. ఫోన్ల ట్యాపింగ్ వివాదంపై కేటీఆర్ సవాల్

TG Battallion Police : బెటాలియన్ కానిస్టేబుళ్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్, సెలవుల రద్దు ఆదేశాలు నిలిపివేత

Telangana Cabinet : రేపే తెలంగాణ మంత్రివర్గ సమావేశం, ఈసారి వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్

Shamshabad Airport Bomb Threat: విమానాలకు వదలని బెదిరింపు కాల్స్.. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు.. తనిఖీ చేస్తున్న పోలీసులు

KTR : ఒరిజినల్ బాంబులకే మేం భయపడలే, గీ సుతిల్ బాంబులకు భయపడతమా ? అధికారంలోకి వస్తాం, అప్పుడు చూసుకుంటం : కేటీఆర్

HYDERABAD CP : ముత్యాలమ్మ గుడి కేసులో నిందితుడు కంప్యూటర్ ఇంజినీర్, ముంబయి పోలీసులతో కలిసి విచారిస్తున్నాం : హైదరాబాద్ సీపీ

Big Stories

×