EPAPER

CM Revanth Reddy Administration | మొదలైన సిఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలన.. సమర్థలైన అధికారులకే పదవులు

Revanth Reddy Administration | సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలన మరో రేంజ్ లో కనిపిస్తోంది. ఎవరైనా అధికారంలోకి రాగానే.. మాట వినే వారిని.. నచ్చిన వాళ్లను తన టీంలో పెట్టుకోవడం పరిపాటి. కానీ రేవంత్ రెడ్డి స్టైల్ మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తోంది. సమర్థులైన అధికారులుగా పేరు తెచ్చుకున్న వారు గత కేసీఆర్ సర్కార్ లో లూప్ లైన్ లో ఉండిపోయారు. ఇప్పుడు వారంతా తెరపైకి వస్తున్నారు. ముక్కుసూటిగా ఉండే వారినే సీఎం రేవంత్ ఏరికోరి తన టీంలో చేర్చుకుంటున్నారు.

CM Revanth Reddy Administration | మొదలైన సిఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలన.. సమర్థలైన అధికారులకే పదవులు

CM Revanth Reddy Administration | సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలన మరో రేంజ్ లో కనిపిస్తోంది. ఎవరైనా అధికారంలోకి రాగానే.. మాట వినే వారిని.. నచ్చిన వాళ్లను తన టీంలో పెట్టుకోవడం పరిపాటి. కానీ రేవంత్ రెడ్డి స్టైల్ మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తోంది. సమర్థులైన అధికారులుగా పేరు తెచ్చుకున్న వారు గత కేసీఆర్ సర్కార్ లో లూప్ లైన్ లో ఉండిపోయారు. ఇప్పుడు వారంతా తెరపైకి వస్తున్నారు. ముక్కుసూటిగా ఉండే వారినే సీఎం రేవంత్ ఏరికోరి తన టీంలో చేర్చుకుంటున్నారు.


ఎక్కడా తగ్గేదేలే… అక్రమార్కుల మాట వినేదేలే… ఇదే స్టైల్.. ఇదే దూకుడు ప్రదర్శిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఫటాఫట్.. ధనాధన్.. ఏదైనా అంతే… అందుకే తన టీంలో అంతా నిఖార్సైన ఆఫీసర్లను నియమించుకుంటున్నారు. ఇన్నాళ్లూ లూప్ లైన్ లో ఉన్న పవర్ ఫుల్ ఆఫీసర్లు ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. వస్తూనే తమ ప్రాధాన్యాలేంటో చెప్పేస్తున్నారు. దీంతో పాలనలో పరిస్థితులు మారిపోతున్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుతం అవినీతి మరక అంటని వారు.. నిజాయితీ ఉన్న ఆఫీసర్లంతా కీలక పోస్టుల్లోకి వచ్చేశారు. ఒక్కొక్కరిని ఏరికోరి తన టీంలో పెట్టుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతికి తావు లేకుండా.. అక్రమాలకు చోటు లేకుండా.. ఉండేలా టీంను రెడీ చేశారు. ఈ పరిణామాలతో మిగితా అధికారులు, సిబ్బంది అంతా అలర్ట్ అవుతున్నారు. సీఎంగా రేవంత్ అలా నియమితులయ్యారో లేదో.. ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించుకున్నారు. ఈ ఇద్దరి నియామకం చూస్తేనే.. పాలన పారదర్శకంగా పవర్ ఫుల్ గా ఉంటుందన్న విషయం అధికారిక వర్గాలకు అర్థమైపోయింది.


ముఖ్యంగా పోలీస్ శాఖలో సంస్కరణలను సవాల్ గా తీసుకున్నారు. కీలక ఆఫీసర్లను తెరపైకి తెచ్చి హైదరాబాద్ ట్రై కమిషనరేట్ల సీపీలుగా చేశారు. ప్రతి డిపార్ట్ మెంట్ ను ప్రక్షాళన చేస్తున్నారు. రిటైర్డ్ అధికారులకు గుడ్ బై చెబుతున్నారు. డ్రగ్స్ కట్టడిపై మొన్ననే రివ్యూ చేసి సమర్థమైన అధికారి సందీప్ శాండిల్యను యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గా నియమించారు. మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దృఢ నిశ్చయంతో ఉండడంతో నిక్కచ్చిగా వ్యవహరించే సందీప్‌శాండిల్యకు నార్కోటిక్స్‌ బ్యూరో బాధ్యతలు అప్పగించారంటున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ట్రై కమిషనరేట్ల పరిధిలో రాచకొండ సీపీగా సుధీర్ బాబు, హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని ప్రభుత్వం నియమించింది. ఈ ముగ్గురూ ముగ్గురే. విధుల్లో సింహస్వప్నాలే. అలాంటి వారికి ఇన్నాళ్లకు ప్రాధాన్య పోస్టులు దక్కాయి.

రాష్ట్రంలోనే అత్యధిక సార్లు బదిలీ అయిన ఐపీఎస్‌ అధికారుల్లో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. ఈయన ముక్కుసూటిగా ఉండే ఆఫీసర్. అన్యాయం చేసే ఎంతటి వారినైనా ఎదురిస్తారు. రాజకీయ బెదిరింపులకు భయపడరన్న టాక్ ఉంది. అందుకే ఆయనను ఇన్నాళ్లూ లూప్ లైన్ లో అప్రధాన్య పోస్టుల్లో ఉంచారు. హైదరాబాద్‌ సీపీగా నియమితులైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, అడిషనల్‌ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి చాలా ఏళ్ల తర్వాత అత్యంత కీలక పోస్టింగ్‌ దక్కింది. గతంలో ఆపరేషన్స్‌ అడిషనల్‌ డీజీగా పనిచేసిన ఆయన తర్వాత అడిషనల్‌ డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్‌గా బదిలీ అయ్యారు. గత కొన్ని నెలలుగా అక్కడ పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం అత్యంత కీలక పోస్టింగ్‌లోకి బదిలీ చేసింది. మరోవైపు అవినాష్‌ మహంతికి సిన్సియర్‌ ఐపీఎస్‌ అధికారిగా పేరుంది. ఇచ్చిన బాధ్యతలను పక్కాగా నిర్వహిస్తారన్న పేరు ఉంది. సైబరాబాద్‌ సీపీ పోస్టు ఐజీ ర్యాంకు అయినా..డీఐజీ ర్యాంకులో ఉన్న అవినాశ్‌ మహంతికి అనూహ్యంగా ఆ బాధ్యతలు అప్పగించడం కీలకంగా మారింది.

ఐపీఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. గతానికి భిన్నంగా అత్యంత కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లను ఒకేసారి బదిలీ చేయడం అందులో భాగమని చర్చ జరుగుతోంది. మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి తన మార్క్‌ టీంను సెట్‌ చేస్తున్నారు. త్వరలోనే పలు జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు సహా భారీ సంఖ్యలో ఐపీఎస్‌ల బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు సైబరాబాద్, రాచకొండ సీపీలుగా పనిచేసిన స్టీఫెన్‌ రవీంద్ర, దేవేంద్రసింగ్‌ చౌహాన్‌లను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలన్నారు. ప్రస్తుతం మల్టీజోన్‌–2 ఐజీ షానవాజ్‌ ఖాసీం ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా నియమితులయ్యారు. సాధారణంగా సీఎంలకు సెక్రెటరీలుగా ఐఏఎస్ లను నియమిస్తుంటారు. కానీ రేవంత్ మాత్రం డిఫరెంట్ గా ఐపీఎస్ అయిన ఖాసింను ఎంచుకున్నారు. దీని వెనుక కూడా భారీ కసరత్తే జరిగి ఉంటుందంటున్నారు.

హైదరాబాద్ పోలీసింగ్ లో చాలా సవాళ్లు ఉన్నాయన్నారు కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. చట్టాన్ని గౌరవించే వారితోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కటినంగా వ్యవహరిస్తామని హెచ్చారించారు. డ్రగ్స్ నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని, సినీ పరిశ్రమ పెద్దలతో త్వరలోనే సమావేశం పెడుతామన్నారు. అటు బార్లు, పబ్ లు, పార్టీల పేరుతో డ్రగ్స్ సప్లై చేసే వారి పట్ల కఠిన వైఖరితో ఉంటామన్నారు. ర్యాగింగ్ ను సహించబోమని, డ్రగ్స్ ముఠాలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారు. లేదంటే తమ మార్క్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు. క్విక్ రెస్పాన్స్ పై ఫోకస్ పెడుతామన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీఎంఓలోకి కొత్త అధికారులను నియమించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. మినీ సెక్రటేరియట్‌గా ఉండే ముఖ్యమంత్రి కార్యాలయానికి సీఎం రోజువారీ వ్యవహారాలను నిర్వహించడానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ముగ్గురు సెక్రటరీ స్థాయి అధికారులు అవసరం. ఈ మేరకు నియామకాల్లో వేగం పెంచారు. గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన స్మితా సభర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అప్లై చేసుకున్నారు. గతంలో కేసీఆర్ నియమించిన సలహాదారులైన రిటైర్డు అధికారుల పదవీ కాలాన్ని రద్దు చేయించారు. ఇందులో రాజీవ్ శర్మ, సోమేష్ కుమార్, ఎస్.కె. జోషి, ఎ.కె. గోయల్, ఎ. రామ లక్ష్మణ్, బి.వి.పాపా రావు, కె.వి. రమణా చారి, జీఆర్ రెడ్డి, ఏకే ఖాన్, అనురాగ్ శర్మ, అధర్ సిన్హా, రాణి కుముదిని ఉన్నారు. అందరినీ ఇంటికి పంపించేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ఆరుగురు సీనియర్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించనున్నారని సచివాలయ వర్గాలంటున్నాయి.

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×