EPAPER

CM Revanth Reddy: గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్.. దశాబ్ది వేడుకలకు ఆహ్వానం

CM Revanth Reddy: గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్.. దశాబ్ది వేడుకలకు ఆహ్వానం

CM Revanth Reddy: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసారు. రేపు జరగబోయే దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ ను సీఎం ఆహ్వానించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకులను జూన్ 2న పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీ రానున్నారు.


రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం గవర్నర్ రాధాకృష్ణన్ ను ఆహ్వానించింది. దశాబ్ది వేడుకల కోసం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పరేడ్ గ్రౌండ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఉత్సవాలను వైభంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాల కళా బృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకు దశాబ్ది ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30కు గన్ పార్క్ అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ సాధనలో అమరులైన వారికి సీఎం నివాళులు అర్పిస్తారు. అనంతరం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ట్యాంక్ బండ్ పై సాయంత్రం తెలంగాణ దశాబ్ది వేడుకలు ప్రారంభం అవుతాయి.


Also Read: తెలంగాణ ఆవిర్భావ వేడుకల పూర్తి వివరాలు.. ఇవే

తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, వివిధ రకాల ఉత్పత్తులు, పుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ కళా రూపాలపై కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం జయ జయహే తెలంగాణ పూర్తి గీతాన్ని విడుదల చేస్తారు. 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఫైర్ వర్క్స్ తో వేడుకలు ముగుస్తాయి.

Related News

Minister Seethakka: వారి మరణానికి కారణం మీరు కాదా..? : ప్రధాని మోదీకి మంత్రి సీతక్క కౌంటర్

Scircilla: నేతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం… దసరా కానుకగా మీకు…

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

TPCC Chief: కేటీఆర్.. అతి తెలివిగా ప్రశ్నలు వేయకు: మహేష్ కుమార్ గౌడ్

Telangana Rice: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..

×