EPAPER

CM Revanth Delhi Tour : ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు హై కమాండ్ తో భేటీ

CM Revanth Delhi Tour : ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు హై కమాండ్ తో భేటీ
CM Revanth Delhi Tour updates

CM Revanth Delhi Tour updates(Political news today telangana): తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఇన్నాళ్లు బడ్జెట్‌ సమావేశాల్లో బిజీ బిజీగా ఉన్నా సీఎం..ఇప్పుడు కేబినెట్‌ విస్తరణపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ ఢిల్లీ టూర్‌పై ఆసక్తి నెలకొంది. నిన్న సాయంత్ర ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా కుమారుడి వివాహానికి హారయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి కూడా రేవంత్‌తో పాటు వెళ్లారు.


Read More : మోడీతో స్నేహానికి కేసీఆర్ నయా ప్లాన్? ఫ్రెండ్లీ రిలేషన్ కోసమే ఢిల్లీ టూర్ ?

హైకమాండ్‌ పెద్దలతో ఇవాళ భేటీకానున్నారు సీఎం రేవంత్‌. రాష్ట్రంలో కేబినేట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, రాష్ట్రంలో పరిస్థితులు వివరించడంతో పాటు లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల గురించి హైకమాండ్‌తో చర్చించినున్నారు. రేవంత్‌.. తన కేబినెట్‌లోకి ఇప్పటి వరకు 12 మందిని తీసుకున్నారు. మరో ఆరుగురికి మంత్రివర్గంలో చోటుంది. అయితే..ఇప్పటి వరకు కేబినెట్‌ విస్తరణపై స్పష్టత లేదు. కానీ ఈ టూర్‌తో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికి కేబినెట్లో ప్రాతినిథ్యం లేని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు ఈ విస్తరణలో ప్రాతినిథ్యం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. అయితే.. ఎవరికి ప్రాధాన్యత కల్పించాలనే దానిపై పార్టీ హైకమాండ్‌తో చర్చించనున్నారు.


ఇక సార్వత్రిక ఎన్నికలు స‌మీపిస్తున్న త‌రుణంలో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంతో హస్తం పార్టీ వ్యూహలు రచిస్తుంది. అయితే.. ఇప్పటికే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కొత్తగా పార్టీలోకి వస్తున్నవారితో పాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కక నిరశకు గురై సర్దుకుపోయిన సొంత పార్టీ నేతల గురించి హైకమాండ్‌తో చర్చించనున్నారు సీఎం రేవంత్‌. మరో వైపు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్‌ బృందం కలిసే అవకాశం ఉంది.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×