Big Stories

CM Revanth Meeting with Officials: వచ్చామా.. వెళ్లామా అన్నట్టు పనిచేస్తే కుదరదు: అధికారులకు సీఎం వార్నింగ్

CM Revanth Reddy Meeting with Officials: కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడం మర్చిపోయారు.. ఇక నుంచి వచ్చామా.. వెళ్లామా అన్నట్టు పనిచేస్తే కుదరదంటూ అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సచివాలయంలో మంగళవారం వివిధ శాఖల సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన విజన్ ని అధికారుల ముందు ఉంచిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వారానికోరోజు క్షేత్రస్థాయి పర్యటన.. నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు.

- Advertisement -

“ప్రతీ నెలా సెక్రటరీలతో సమావేశం ఉంటుంది. పని చేసే అధికారులకు నా సహకారం ఉంటుంది. తేడా వస్తే చర్యలు కూడా ఉంటాయి. ఇకపై నేను కూడా ఫీల్డ్ విజిట్, ఆకస్మిక తనిఖీలు చేస్తా” అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు.

- Advertisement -

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులతో సీఎం చెప్పారు. అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాల గురించి ఆలోచించాలన్నారు. రెండు వారాల్లో ప్రతి అధికారి కూడా ఒక ఫ్లాగ్ షిప్ ఐడియా ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటు ముఖ్య కార్యదర్శులు కూడా వారానికోసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలన్నారు.

చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదంటూ సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. నెలకోసారి జిల్లా అధికారులతో పనుల పురోగతిపై చర్చించాలంటూ సూచించారు. ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లను కలెక్టర్లు తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు, దుర్ఘటనలపై అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. పనితీరు ఆధారంగానే అధికారులకు ఉన్నత అవకాశాలుంటాయని స్పష్టం చేశారు. త్వరలో వారానికొక జిల్లా పర్యటనకు వెళ్తానంటూ సీఎం తెలిపారు.

ఏపీ ఆధీనంలో ఉన్న భవనలు, గెస్ట్ హౌస్ లను స్వాధీనం చేసుకునేలా నివేదిక సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Also Read: చంద్రబాబు లేఖపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే..?

ఇదిలా ఉంటే.. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. ఈ మేరకు రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎంపిక చేసింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలను ఈ మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సు చేయనున్నది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News