EPAPER
Kirrak Couples Episode 1

CM KCR : గజ్వేల్ కు గుడ్ బై .. కామారెడ్డి నుంచే కేసీఆర్ పోటీ..?

CM KCR : గజ్వేల్ కు గుడ్ బై .. కామారెడ్డి నుంచే కేసీఆర్ పోటీ..?
CM KCR


CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? గజ్వేల్ నుంచి మరో నియోజకవర్గానికి గులాబీ బాస్ మారిపోనున్నారా? కామారెడ్డి వెళ్లనున్నారనే చర్చలో నిజమెంత? ఆయన పోటీ చేసే స్థానంపై BRS పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ అంశాలపై చర్చ నడుస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్ … అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో బిజీగా ఉంది. గులాబీ బాస్ కేసీఆర్ అభ్యర్థుల కూర్పు విషయంలో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఐతే ఆయన పోటీ చేయాల్సిన నియోజకవర్గంపై మాత్రం తర్జన భర్జన కొనసాగుతోంది. తరచూ నియోజకవర్గాలు మార్చే కేసీఆర్.. ఈసారి గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చే విధంగా అసెంబ్లీ లాబీల్లో కామారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేసిన చిట్ చాట్ సంచలనంగా మారింది.


సీఎం కేసీఆర్ ను కామారెడ్డిలో పోటీ చేయాలని తాను మూడు సార్లు కోరినట్లు గంప గోవర్థన్ తెలిపారు. అంతే కాదు ఆయన వంద శాతం కామారెడ్డిలోనే పోటీ చేస్తారని వెల్లడించారు. ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్ ను గెలిపిస్తానన్నారు గంప గోవర్థన్. అలాగే తాను గులాబీ పార్టీలో ఏం చేయాలో కేసీఆరే నిర్ణయిస్తారని వెల్లడించారు. కేసీఆర్ సొంత గ్రామం కామారెడ్డి నియోజక వర్గంలోనే ఉందంటున్నారు కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. మిడ్ మానేరులో వారి గ్రామం మునిగితే వారి కుటుంబం చింత మడక వెళ్లిందని చెప్పారు.

మరోవైపు గజ్వేల్ నుంచి కామారెడ్డికి మార్పు వెనుక కేసీఆర్ రాజకీయ చతురత ఉందనే చర్చ జరుగుతోంది. నిజానికి కామారెడ్డి పొరుగున ఉన్న మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ వీక్గా ఉంది. ఒకవేళ సీఎం కామారెడ్డి నుంచి బరిలో దిగితే పక్కనున్న రామాయంపేట, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్‌తోపాటు జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ మరింత బలం పుంజుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆయన అక్కడి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది.

ఇక గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్‌పై రెండు సార్లు టీడీపీ తరపు నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. నిజానికి అక్కడ కేసీఆర్ అభ్యర్థి కాకపోతే ఆయనే గెలుస్తారన్నంతగా ప్రజల్లో తిరిగారు. ఆయనపై ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. గత ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరిపోయారు. పార్టీలో చేరే ముందే వంటేరు ప్రతాప్ రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కోసం కేసీఆర్ నియోజకవర్గం మారుతున్నారనే ప్రచారం కూడా నెలకొంది.

అటు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు కేటాయిస్తామని గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించినా… సర్వే ఫలితాలు అనుకూలంగా లేకుంటే మాత్రం అభ్యర్థులను మారుస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కామారెడ్డిలో నిర్వహంచిన సర్వేలో ఎమ్మెల్యే గంప గోవర్థన్ పనితీరు ఏ మాత్రం బాగోలేదని తేలినట్లు తెలుస్తోంది. ఇది కూడా కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగాలని భావించడానికి కారణం కావొచ్చంటున్నారు.

మరోవైపు గజ్వేల్ నుంచి కేసీఆర్ ఈసారి బరిలోకి దిగడం లేదనే చర్చ చాలా రోజుల నుంచి కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుల నుంచి కేసీఆర్ కు సవాళ్లు కూడా ఎదురయ్యాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా… కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలని.. తాము కూడా అక్కడే నుంచే పోటీ చేస్తామని తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి కౌంటర్ మాత్రం రాలేదు. అంటే ఈసారి కేసీఆర్ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Related News

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

Big Stories

×