EPAPER
Kirrak Couples Episode 1

Dil raju: దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీ.. ఏ పార్టీ? ఫుల్ క్లారిటీ..

Dil raju: దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీ.. ఏ పార్టీ? ఫుల్ క్లారిటీ..
dil raju political

Dil Raju: దిల్ రాజు. టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్. బడా డిస్టిబ్యూటర్. తెలుగు సినిమా పరిశ్రమలో కింగ్ పిన్. అనేక హిట్లు.. అదేస్థాయిలో ఫ్లాప్‌లు. నిర్మాతల మండలిలో యాక్టివ్‌గా ఉండే రాజు.. తన దిల్‌ను మరింత విశాలం చేస్తున్నారు. కొత్త పెళ్లితో కొంగొత్త జీవితం ప్రారంభించారు. సినిమాల్లోనే కాకుండా ఈ మధ్య పొలిటికల్‌గాను ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. అధికార ప్రతిపక్షాలనే తేడా లేకుండా అన్ని పార్టీల బాస్‌లతో కలిసిమెలిసి ఉంటున్నారు. దిల్ రాజు సడెన్‌గా రాజకీయ నేతలతో రిలేషన్స్ పెంచుకుంటుండటంపై ఇండస్ట్రీ లోన, బయట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. లాభం లేనిదే ఏ పనీ చేయని రాజు.. పొలిటికల్ పావులు కదుపుతుండటం వెనుక వ్యూహం ఉందా?


దిల్ రాజుకు జనసేనాని పవన్ కల్యాణ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవలే పవర్ స్టార్‌తో భీమ్లా నాయక్ కూడా తీశారు. అదే సమయంలో థియేటర్లలో టికెట్ ధరలు తగ్గించి.. భీమ్లా నాయక్‌ సినిమాను దెబ్బకొట్టే ప్రయత్నం చేసిన సీఎం జగన్‌తోనూ అంతే సన్నిహితంగా మెదిలారు. టికెట్ ధరలపై జగన్‌తో చర్చించిన టాలీవుడ్ ప్రముఖుల్లో ఆయన కూడా ఉన్నారు. ఒకే సమయంలో ఇటు పవన్ కల్యాణ్.. అటు జగన్‌లతో దిల్ రాజు రిలేషన్ మెయిన్‌టెన్ చేయడమంటే మామూలు విషయం కాదు.

తెలంగాణలోనూ అదే తరహా అడుగులు వేస్తున్నారు దిల్ రాజు. ఇటీవల ‘బలగం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌తో కలిసి కనిపించారు. మూవీ ఈవెంట్‌లో పొలిటికల్ స్పీచ్ చేసి దిల్ రాజు న్యూస్‌లో నిలిచారు. కేటీఆర్ సమక్షంలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురింపించారు. దిల్ రాజు మాటలు విన్నవారంతా.. ఆయన బీఆర్ఎస్‌లో చేరుతున్నారా? అనే అనుమానం వ్యక్తం చేశారు.


కట్ చేస్తే, ఈమధ్య దిల్ రాజు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డినీ కలిశారు. ఆయన స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా నర్సింగ్‌పల్లికి రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేరుకున్న సందర్భంగా.. దిల్ రాజు ఎదురేగి మరీ స్వాగతం పలికారు. గ్రామంలో తాను నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో రేవంత్‌రెడ్డితో ప్రత్యేక పూజలు చేయించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో దిల్ రాజు దిల్‌దార్‌గా సహకరించారు. ఆయన హడావుడి చూసి.. కాంగ్రెస్‌లో చేరుతారా? అనే చర్చ కూడా స్టార్ట్ అయిపోయింది.

ఇలా.. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలో అధికార, విపక్ష నేతలతో దిల్ రాజు చేస్తున్న ‘రాజు’కీయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దిల్ రాజు ఆ పార్టీలో చేరుతారని ఒకరు.. కాదు ఈ పార్టీలో చేరుతారంటూ మరొకరు.. బండ్ల గణేశ్‌తో పొల్చుతూ ఇంకొకరు.. సినిమా నిర్మాత కదా అందుకే రాజకీయ నేతలను బుట్టలో వేసుకుంటున్నారంటూ వేరొకరు.. ఇలా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది.

లేటెస్ట్‌గా.. దిల్ రాజు తన రాజకీయ ప్రవేశంపై స్పందించారు. రాజకీయాల్లో రమ్మని తనని అడుగుతున్నారని, అయితే ఈ విషయంలో తాను ఒక స్పష్టతకు రాలేదని అన్నారు. వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. అయితే, సినిమా పరిశ్రమలోనే ఎవరైనా తనపై కామెంట్స్‌, విమర్శలు చేస్తే తట్టుకోలేనని.. అలాంటిది రాజకీయాల్లోకి వెళితే విమర్శలు మరీ దారుణంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి వెళ్లాలంటే మానసికంగా అన్నింటికీ సిద్ధపడి వెళ్లాలి.. అది తన వల్ల కాకపోవచ్చని.. ఇందులోనే మీకు కావాల్సిన సమాధానం వెతుకోవచ్చని.. దిల్ రాజు స్పష్టం చేశారు. ఇంతకీ ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టా? రానట్టా?

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×