EPAPER
Kirrak Couples Episode 1

Chiranjeevi: పవన్ ను ఉన్నతస్థానంలో చూస్తాం.. చిరంజీవి మాటలకు అర్థాలే వేరులే!

Chiranjeevi: పవన్ ను ఉన్నతస్థానంలో చూస్తాం.. చిరంజీవి మాటలకు అర్థాలే వేరులే!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు పవన్ కల్యాణ్ ను ఏదో ఒకరోజు ఉన్నత స్థానంలో చూస్తాం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. తనకు రాజకీయాలు అంతగా సరిపడలేదని.. కటువుగా, మొరటుగా ఉండలేనని.. అదే పవన్ మాత్రం రాజకీయాలకు తగినవాడంటూ ప్రశంసించారు. హైదరాబాద్ లో జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో చిరు చేసిన ఈ బిగ్ స్టేట్ మెంట్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.


ఉన్నత స్థానం అంటే.. ముఖ్యమంత్రి స్థానమేగా? అంటున్నారు మెగా ఫ్యాన్స్. జనసేనానే ఏపీకి కాబోయే సీఎం అని.. మెగాస్టార్ సైతం తేల్చేశారంటూ సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్ట్స్ పెడుతున్నారు. ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ కు చిరంజీవి బహిరంగంగా మద్దతు ఇచ్చిన సందర్భాలు తక్కువే. అలాంటిది పవన్ ను ఉన్నత స్థానంలో చూస్తామంటూ మెగాస్టార్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల కాలంలో చిరంజీవి.. ఏపీ సీఎం జగన్ తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో టాలీవుడ్ పెద్దన్నగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చిరంజీవిని వైసీపీ తరఫున రాజ్యసభ సీటు కూడా ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదంటూ మెగాస్టార్ అప్పట్లోనే ఖండించారు. జగనే అని కాదు.. కేసీఆర్ ఫ్యామిలీతోనూ మెగా కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయి.


తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేనతో రాజకీయ పోరాటం చేస్తుండగా.. మెగా బ్రదర్ నాగబాబు సైతం ఆ పార్టీ కీలక నేతగా ఉన్నారు. చిరంజీవికి మాత్రం ఇప్పటి వరకూ జనసేనతో అఫీషియల్ గా ఎలాంటి సంబంధం లేదు. తమ్ముడంటే విపరీతమైన ప్రేమ.. పవన్ రాజకీయాల్లో రాణించాలనే ఆకాంక్షం మెగాస్టార్ లో మెండుగా ఉంది. అందుకే, రాజకీయాలకు తను సరిపడను అంటూనే.. పవన్ అయితే బెస్ట్ అన్నట్టు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎప్పటికైనా పవన్ ను ఉన్నత స్థానంలో చూస్తాం అంటూ అన్నయ్య ప్రేమ చాటుకున్నారు. ఉన్నత స్థానం అంటే.. ముఖ్యమంత్రి స్థానమేగా అంటున్నారు ఫ్యాన్స్.

Related News

Kiraak RP: రోజాకు అసలు విలువలు లేవు, అలా డబ్బులు సంపాదించుకుంటుంది.. కిర్రాక్ ఆర్పీ వ్యాఖ్యలు

Tammineni Seetaram: తప్పు ఆవులదేనా? తిరుమల లడ్డూ వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని స్పందన ఇది

Tobacco in Laddu : మా లడ్డూలో పొగాకు లేదు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ.. ఏం జరిగింది ?

Nimmakayala: జగన్‌కు నిమ్మకాయల లేఖ.. మీ వెంట నడవలేకపోతున్నామంటూ…

Tirumala Laddu Row: లడ్డూ లడాయి.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్లో తప్పేముంది ? ఏపీ ప్రభుత్వంపై అంబటి రాంబాబు ఫైర్..

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘటన… ఎస్ఎంఎస్‌లో ప్రమాదం, కార్మికులకు గాయాలు

AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవులు.. తొలి విడతలో

Big Stories

×