Chikoti Praveen: చీకోటి ప్రవీణ్. ఆయనతో పాటు మరో 83మంది భారతీయులు థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫైన్ కట్టి బెయిల్‌పై బయటకు వచ్చి.. సేఫ్‌గా ఇండియాలో ల్యాండ్ అయ్యారు. థాయ్‌లో గ్యాంబ్లింగ్ నిషేధమని.. పోకర్ ఆడకూడదని తనకు తెలీదంటూ అమాయకంగా మాట్లాడుతున్నాడు చీకోటి. తాను ఆర్గనైజర్ కాదని.. ఓ ఇద్దరు పిలిస్తే వెళ్లానని చెబుతున్నాడు. చెప్పేవాడికి వినేవాళ్లు లోకువంటే ఇదే మరి.
ఇక, థాయ్ పోలీసులు పక్కాగా గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌పై రైడ్ చేసినట్టు తెలుస్తోంది. ఏషియా పటాయాలో కొందరు ఇండియన్స్ దిగారని.. వారి వ్యవహారం అనుమానాస్పదంగా ఉందంటూ అక్కడి పోలీసులకు సమాచారం అందింది. ముందుగా రెక్కీ చేసిన కాప్స్.. ఆ తర్వాత మండే ఎర్లీ మార్నింగ్ ఆ హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహిస్తున్న గ్యాంబ్లింగ్‌పై రైడ్ చేశారు. లోకల్ పోలీసులను చూసి మనోళ్లంతా పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు వారిని చుట్టుముట్టి చెక్ పెట్టారు.
అందరినీ ఒకచోట కూర్చోబెట్టి వివరాలు తీసుకున్నారు. టోకెన్లతో సహా ఆ గ్యాంబ్లింగ్ సెంటర్‌లో ఉన్న వస్తువులు, పరికరాలన్నీ ఇండియా నుంచి తెచ్చినవే. ఇక, అక్కడ అడుగడుగునా సీసీకెమెరాలు పెట్టారట. ఆ లింక్ హైదరాబాద్‌లోని చీకోటి ప్రవీణ్ అనుచరులకు ఇచ్చారని గుర్తించారు. థాయ్‌లాండ్ హోటల్‌లో గ్యాంబ్లింగ్ జరుగుతున్న తీరును, ఎలాంటి చీటింగ్‌కు పాల్పడకుండా గ్యాంబ్లర్ల కదలికలను.. హైదరాబాద్‌లోని చీకోటి స్టాఫ్.. నిశితంగా పరిశీలించే వారని తేల్చారు. పోలీసులు రాగానే.. అప్పటి వరకూ కెమెరాలతో కనెక్టెడ్‌గా ఉన్న వారంతా వెంటనే ఆఫ్‌లైన్ అయిపోయారు.
గ్యాంబ్లింగ్ కేసులో ప్రవీణ్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గాజులరామారం వీఆర్‌ఏ వాసు తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.