EPAPER

TG Bandi Sanjay:పండుగ వేళ ఒవైసీ అక్బరుద్దీన్ పై బండి సంజయ్ ఫైర్

TG Bandi Sanjay:పండుగ వేళ ఒవైసీ అక్బరుద్దీన్ పై బండి సంజయ్ ఫైర్

central Minister Bandi Sanjay coments on Akbaruddin Owaisi during Bonalu
తెలంగాణ పాతబస్తీ బోనాలు అత్యంత వైభవంగా జరుగుతున్న వేళ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ జాతరలో పోతరాజులా ఆగ్రహోదగ్ధులయ్యారు. ఆదివారం హైదరాబాద్ గల్లీ గల్లీలలో కొలువు తీరిన అమ్మవార్లకు పెద్ద సంఖ్యలో భక్తులు బోనాలు సమర్పించారు. రాష్ట్రం సుభిక్షింగా ఉండేలా తమని తమ కుటుంబాన్ని ఆశీర్వదించాలని అమ్మలకన్న అమ్మలకు భక్తి పారవశ్యంతో ముక్కులు తీర్చుకుంటున్నారు. సోమవారం ఫలారం ఊరేగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పండుగగా దీనిని గుర్తించింది. జాతర సందర్భంగా పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో కొలువైన భాగ్యలక్షి అమ్మవారిని ఆదివారం కేంద్ర సహాయ మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడే ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో మాట్లాడారు.


ఏర్పట్ల తీరుపై అసంతృప్తి

బోనాల ఏర్పాట్లపై తన అసంతృప్తిని తెలిపారు. ఈ సందర్భంగా ఆ అమ్మవారిని సందర్శించి మొక్కుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయని..మహిమాన్వితమైన శక్తికి కలిగివున్న తల్లి అని..బోనాలలో ముక్కులు తీర్చుకుంటే మళ్లీ వచ్చే ఏడాది దాకా కష్టాలు మన దరిచేరవని అన్నారు. అయితే ఇదే సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో కొన్ని ప్రాంతాలలో బోనాలను అడ్డుకుంటున్నారని..దీని వెనక ఉన్న రాజకీయ శక్తులేమిటో తనకి తెలుసని అన్నారు. వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. అక్బరుద్దీన్ తన బలమేమిటో తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఎంఐఎం పార్టీ గోడమీద పిల్లి లాంటిదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి మద్దతు నిచ్చే పార్టీ ఎంఐఎం అన్నారు. ఎంఐఎం ఉండగా పాత బస్తీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోదని అన్నారు.


బోనాలకు ఇంత తక్కువ నిధులా?

అక్బరుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డి కలిసి బోనాల పండుగపై కుట్రలు చేసి అడ్డుకుంటున్నారన్నారు. అక్బరుద్దీన్ ను ఎలాగైనా డిప్యూటీ సీఎం చేయాలని రేవంత్ చూస్తున్నారని అన్నారు. అక్బరుద్దీన్ కు దమ్ముంటే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ప్రాంతం నుంచి పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు. రేవంత్ సర్కార్ బోనాల ఏర్పాట్ల కోసం కేవలం రూ.5 లక్షలు మాత్రమే నిధులు విదిల్చిందని అదే పాతబస్తీలో జరుపుకునే రంజాన్ పండుగకు మాత్రం రూ.33 కోట్లు ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. హిందూ, ముస్లిం పండుగల పేరుతో సీఎం రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కొంత మంది వ్యక్తుల ప్రలోభాలకు లొంగిపోయి రేవంత్ రెడ్డి అలా ప్రవర్తిస్తున్నారు.

గోల్డెన్ టెంపుల్ గా భాగ్యలక్హి ఆలయం

భాగ్యలక్ష్మి ఆలయాన్ని బీజేపీ ప్రభుత్వమే డెవలప్ చేసిందని..ఇకపైనా భాగ్యలక్ష్మి ఆలయానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ సారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రూలింగ్ లోకి వస్తే భాగ్యలక్హి ఆలయాన్ని బంగారు ఆలయంగా మారుస్తామని అన్నారు. ఇకపై భాగ్యలక్హి టెంపుల్ అంటే గోల్డెన్ టెంపుల్ గా చెప్పుకునేలా చేస్తామని అన్నారు.

Related News

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×