EPAPER

EC Grants Permission: రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి!

EC Grants Permission: రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి!

EC Grants Permission for TS State Formation day Celebrations: జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా జూన్ 2న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరింది.


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఆ రోజు గన్ పార్క్ లోని ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు.

అయితే, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నాతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు.


Also Read: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడు: మంత్రి జూపల్లి

వేదిక వద్ద ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలన్నారు. వేదిక వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, వేదిక వద్దకు ప్రముఖులు వచ్చి, పోయే సమయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎండ కొట్టకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఒకవేళ ఏమైనా సమస్య తలెత్తినా వెంటనే అది పరిష్కారమయ్యే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నామని ఆమె పేర్కొన్నారు.

Tags

Related News

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Big Stories

×