EPAPER

Telangana:కేంద్ర బడ్జెట్ కేటాయింపులు.. తెలంగాణ బీజేపీ ఎంపీలకు పెద్ద టాస్కే..

Telangana:కేంద్ర బడ్జెట్ కేటాయింపులు.. తెలంగాణ బీజేపీ ఎంపీలకు పెద్ద టాస్కే..

Central budget for telangana(Political news in telangana):
త్వరలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఈ సారైనా న్యాయం జరుగుతుందా అని రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తోంది. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించుకుంది బీజేపీ. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా బండి సంజయ్ సారధ్యం వహిస్తున్నారు. మోదీ పాలనలో గత పదేళ్లుగా తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరుగుతునే ఉంది. భారీ ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రచారం చేసిన మోదీ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఆపన్న హస్తం అందిస్తూ వస్తోంది. మిగిలిన రాష్ట్రాలపై సవతి ప్రేమ చూపిస్తోందని విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా విదిల్చలేదు గత సంవత్సరం బడ్జెట్ లో. తెలంగాణ తరపున సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు,రైల్వే కేటాయింపులు, లిఫ్ట్ ఇరిగేషన్లు, విద్య, వైద్యం కేటాయింపులలో కనీసం ఈ సారైనా న్యాయం చేయాలని తెలంగాణ ప్రాంత వాసులు కోరుతున్నారు.


రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా..

ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఈ సారి తెలంగాణ బడ్జెట్ పై మోదీ సర్కార్ ను నిలదీస్తారని అంతా భావిస్తున్నారు. అలాగే తెలంగాణ నుంచి ఎంపీకైన 8 మంది బీజేపీ ఎంపీలు సైతం తెలంగాణ కేటాయింపులపై పెదవి విప్పాలని డిమాండ్ చేస్తున్నారు.


తెలంగాణ డిమాండ్లు ఇవే..

ఈ సారి గృహ రుణాలకు సంబంధించి రాయితీని మరింత పెంచాలని, గృహనిర్మాణ సంస్థలు రియాలిటీని ప్రోత్సహించాలని అందుకు సామాన్య, మధ్యతరగతి వేతన జీవులకు గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నాయి. ఇక ఎప్పటినుంచో కోరుతున్నట్లు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తెలంగాణలో ఏదో ఒక జల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, ఖమ్మం జిల్లాలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, సింగరేణి సంస్థ అభివృద్ధికి కేంద్రం కృషి చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణలో పలు వెనకబడిన నియోజకవర్గాలకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. చేనేత వస్త్రాలపై ఎంతో కాలంగా వస్తున్న డిమాండ్ జీఎస్టీ ఎత్తి వేయాలని కోరుతున్నారు.

పురపాలక శాఖలు బలోపేతం

పంచాయతీ,పురపాలక శాఖలను బలోపేతం చేయడానికి వాటికి పుష్కలంగా నిధులు ఇచ్చేలా చేయాలని ఎంపీలను డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీలను తొందరగా భర్తీ చేయాలని, అలాగే రాష్ట్రానికి మరిన్న వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. రైతుల ఆదాయం పెరిగే దిశగా వారి పంటలకు గిట్టుబాటు ధరను కేంద్రం కల్పించాలని సూచిస్తున్నారు. రైతులకు సబ్సిడీ కింద ఇచ్చే ఎరువులు,విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ల సంఖ్య పెంచాలని ఆ దిశగా ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆశిస్తున్నారు. కొత్తగా మరిన్ని జిల్లాలలో ఎయిర్ పోర్టులు నెలకొల్పాలని, హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ హోదా కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రతిపాదిత పారిశ్రామిక కారిడార్లకు నిధులు కేటాయించాలని సూచిస్తున్నారు.

బీజేపీ ఎంపీలపైనే బాధ్యత

ఈ డిమాండ్లను తీర్చడానికి బీజేపీ ఎంపీలే పూనుకోవాలని..మరోసారి తెలంగాణలో ఓట్లు రాబట్టుకోవాలంటే కనీస కేటాయింపులు తెలంగాణకు జరగాలని..ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణకు ఏ రకంగా కేటాయింపులు జరుగుతాయో అవి తమపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని బీజేపీ ఎంపీలు ఆందోళన పడుతున్నారు.

Tags

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×