EPAPER

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో షాక్.. సీబీఐ విచారణకు రంగం సిద్ధం..

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో షాక్.. సీబీఐ విచారణకు రంగం సిద్ధం..
CBI Files Petition To Question Kavitha In Delhi Liquor Case
CBI Files Petition To Question Kavitha In Delhi Liquor Case

CBI Files Petition To Question Kavitha in Delhi Liquor Case(Telugu news live): ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేదుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ రూస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. తాజాగా కోర్టు కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది.


దీంతో సీబీఐ వచ్చే వారం కవితను విచారించనుంది. కాగా విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు సీబీఐను ఆదేశించింది. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కవితను ప్రశ్నించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక విచారణకు వెళ్లేటప్పుడు ల్యాప్‌టాప్, స్టేషనరీ తీసుకెళ్లాలని సీబీఐకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

లిక్కర్ పాలసీలో కీలక పాత్ర పోషించారని కవిత ఆరోపణలు ఎదుర్కుంటోంది. తాజాగా ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచింది.


ముందుగా ఈ కేసులో కవితను సాక్షిగా విచారించిన సీబీఐ.. ఆ తరువాత ఛార్జ్‌షీట్‌లో నిందితురాలుగా పేర్కొంది. దీంతో విచారణకు హాజరుకావాలని సీబీఐ గత నెల 23న కవితకు 41-ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది. అప్రూవర్లుగా మారిన కవిత పీఏ అశోక్, నిందితులు శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలంతో సీబీఐ కవితను నిందితురాలుగా పేర్కొంది. కాగా కేసు పెండింగ్‌లో ఉందని.. ఈ లిక్కర్ స్కాంలో తన పాత్ర లేదని.. తాను విచారణకు హాజరుకాలేనని కవిత గత నెల 25న సీబీఐకు లేఖ రాశారు. ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు సీబీఐ దూకుడు కలవర పెట్టే అంశం.

Tags

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×