EPAPER

CBI Arrested MLC Kavitha: సీబీఐ అదుపులో కవిత, ఎందుకోసం..?

CBI Arrested MLC Kavitha: సీబీఐ అదుపులో కవిత, ఎందుకోసం..?

CBI Arrested MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెని గురువారం సీబీఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో ఆమెను అదుపులోకి  తీసుకున్నట్లు  తెలుస్తోంది.


ఈనెల ఆరున సీబీఐ ఆమెని తీహార్ జైలులో విచారించింది. అయితే సీబీఐ విచారించడంపై కవిత పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. ఆమెని విచారించేందుకు మహిళ కానిస్టేబుల్ ఉండాలనే షరతు న్యాయస్థానం విధించింది. ముందుగా సమాచారం ఇవ్వాలని పేర్కొంది. న్యాయస్థానం చెప్పిన 24 గంటల్లోపు ఆమెని అరెస్ట్ చేసింది సీబీఐ. లిక్కర్ కేసులో ఆమెని విచారించిన తర్వాత న్యాయస్థానంలో సీబీఐ హాజరుపరచనుంది.

లిక్కర్ కేసులో ముఖ్యంగా వంద కోట్ల ముడుపులు వ్యవహారంపై దృష్టి పెట్టనుంది సీబీఐ. సౌత్ గ్రూప్‌కి చెందిన ఆధారాలు మా వద్ద ఉన్నాయనేది ఈడీ వాదన. ఈ క్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశముందని సమాచారం. గతంలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇదే విధంగా జరిగిందని నేతలు చెబుతున్నారు. ఈ కేసులో అరెస్టయిన నేతలను గమనిస్తే.. ఆరు నెలల వరకు ఎవరికీ బెయిల్ వచ్చిన సందర్భాలు లేవు. అప్రూవల్‌గా మారిన కొంతమంది నిందితులకు మాత్రమే బెయిల్ లభించింది.


Tags

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×