EPAPER

KTR and Harish Rao: కేటీఆర్‌, హ‌రీష్‌రావులు బుక్కయ్యారు, పిలుపు ఎప్పుడు?

KTR and Harish Rao: కేటీఆర్‌, హ‌రీష్‌రావులు బుక్కయ్యారు, పిలుపు ఎప్పుడు?

KTR and Harish Rao: మంత్రి కొండా సురేఖ-కేటీఆర్ వ్యవహారంలో న్యూ ట్విస్ట్. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. లేటెస్ట్‌గా బీఆర్ఎస్ నేత కేటీఆర్, హరీష్‌రావులపై కేసు నమోదు చేశారు. పోలీసుల నుంచి రేపో మాపో ఆయా నేతలకు పిలుపు రావచ్చని అంటున్నారు.


మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందనరావు- మంత్రి కొండా సురేఖ మధ్య చోటు చేసుకున్న వ్యవహారాన్ని బీఆర్ఎస్ సోషల్‌మీడియా అసభ్యకరంగా పోస్టులు పెట్టింది. దీనికి సంబంధించిన పలు యూట్యూబ్ ఛానెళ్లు కూడా ఆ వార్తలను ప్రచారం చేశాయి.

ALSO READ: యశోదా ఆసుపత్రి.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుల ముష్టిఘాతాలు.. ఆపై


ఈ నేపథ్యంలో ఎంపీ రఘునందనరావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారితోపాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులతోపాటు యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు ప్రస్తావించారు.

ఎంపీ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నేతలతోపాటు యూట్యూబ్ ఛానెళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గడిచిన నాలుగురోజులుగా ఈ వ్యవహారం పెను దుమారం రేగింది. దీనిపై మంత్రి కొండా సురేఖ- కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన విషయం తెల్సిందే. నేతలను విచారించేందుకు రేపో మాపో పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు అంతర్గత సమాచారం.

Related News

Jagadish Reddy supporters fighting: యశోదా ఆసుపత్రి.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుల ముష్టిఘాతాలు.. ఆపై

Kondakal: కొండకల్ తండాలో ఏం జరుగుతోంది..? ‘స్వేచ్ఛ’ వార్తలతో విషయం వెలుగులోకి..

TG Govt: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఆ రైతన్నలకు రూ.500 బోనస్.. 48 గంటల్లో డబ్బు జమ

Minister Sridharbabu: వాళ్లతో నష్టపోవడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు: మంత్రి శ్రీధర్ బాబు

Rain Alert: రేపటి నుండి వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలలో మాత్రం అంతంత మాత్రమే.. మరికొన్ని జిల్లాలలో..

Harishrao: ఆరునూరైనా అడ్డుకుని తీరుతా.. అవసరమైతే అక్కడికి కూడా వెళ్తా: హరీష్ రావు

Big Stories

×