EPAPER

Car Accident in Shamirpet: శామీర్‌పేటలో కారు బీభత్సం.. ముగ్గురు దుర్మరణం

Car Accident in Shamirpet: శామీర్‌పేటలో కారు బీభత్సం.. ముగ్గురు దుర్మరణం

Car Accident in Shamirpet(Hyderabad news today): హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శామీర్‌పేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంతో వచ్చిన ఇన్నోవా కారు అదుపుతప్పింది. అనంతరం ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.


వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అతివేగమే ప్రమాద కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు సైతం కారు వేగంగా వెళ్లిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Also Read: దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు..గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిందుతుడు మృతి!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఇన్నోవా కారు..అతి వేగంతో అదుపుతప్పి డివైడైర్ ను ఢీకొట్టింది. వేగానికి డివైడైర్ అవతలి వైపు వెళ్లి ఆ రోడ్డున బోల్తా పడింది. ఈ సమయంలో ఓ బస్సు వస్తుండగా..డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. దీంతో ఆ బస్సు.. కారును ఢీకొట్టకుండా చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×