EPAPER

RS Praveen Kumar Meets KCR : కేసీఆర్‌తో ప్రవీణ్ కుమార్ భేటీ.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు..

RS Praveen Kumar Meets KCR : కేసీఆర్‌తో ప్రవీణ్ కుమార్ భేటీ.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు..

 


RS Praveen Kumar Meets KCR

BRS Alliance With BSP : తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్ లో కేసీఆర్ ఇంటికి ప్రవీణ్ కుమార్ వెళ్లారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.


అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. కానీ ఒక్కస్థానంలో కూడా గెలవలేకపోయింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి  పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు కూడా రాలేదు.

Read More: వాళ్లకు ఫ్యామిలీ ఫస్ట్.. నాకు దేశం ఫస్ట్..

త్వరలో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  భేటీకావడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుకు సమోధ్య కుదిరింది. అందుకోసమే గులాబీ బాస్ తో బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు భేటీ అయ్యారని అంటున్నారు. ఈ అంశంపైనే ప్రస్తుతం తెలంగాణలో చర్చ నడుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని కేసీఆర్, ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇరువురు నేతలు కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. బీఎస్పీతో గౌరవ ప్రదమైన పొత్తు ఉంటుందని కేసీఆర్ అన్నారు. సీట్ల సర్దుబాటు వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘార పరాజయాన్ని చవిచూసింది. కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికలు జరిగిన 4 నెలలకే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఒంటరి పోటీకి వెనుకాడతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేశారు. ఎన్నికల ముందు వామపక్షాలను దూరంపెట్టారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కలిసి వచ్చే పార్టీల కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే బీఎస్పీతో పొత్తు కుదుర్చుకున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో  9  ఎంపీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంతుకు ముందు జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. కానీ 4 నెలల వ్యవధిలోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అదే జోరు కొనసాగించలేకపోయింది.

ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ కు కొత్త సవాల్ ను విసురుతున్నాయి. ఇప్పటి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ , నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు కారు దిగిపోయారు.  వెంకటేశ్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీబీ పాటిల్ , పి. రాములు బీజేపీలో చేరిపోయారు. దీంతో గులాబీ బాస్ లో గుబులు మొదలైంది. పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.

Tags

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×