EPAPER
Kirrak Couples Episode 1

BRS the rich regional party | ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి.. బిఆర్ఎస్ ఖజానా నింపుకున్న కేసీఆర్

BRS the rich regional party | రాష్ట్రాన్ని పదేళ్లు నడిపిన నేత.. ప్రభుత్వ ఖజానాను ఇంకెంత పకడ్బందీగా నడిపించాలి? తనదాకా వస్తే ఒకటి.. ప్రజలకు సంబంధించి డబ్బయితే మరొకటా? ఏది న్యాయం.. ఏది అన్యాయం.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో డబ్బుల మాట అటుంచితే.. అప్పుల భారం మోపి వెళ్లిన కేసీఆర్… తన బీఆర్ఎస్ పార్టీ ఖజానాను మాత్రం ఓ రేంజ్ లో నింపుకున్నారు.

BRS the rich regional party | ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి.. బిఆర్ఎస్ ఖజానా నింపుకున్న కేసీఆర్

BRS the rich regional party | రాష్ట్రాన్ని పదేళ్లు నడిపిన నేత.. ప్రభుత్వ ఖజానాను ఇంకెంత పకడ్బందీగా నడిపించాలి? తనదాకా వస్తే ఒకటి.. ప్రజలకు సంబంధించి డబ్బయితే మరొకటా? ఏది న్యాయం.. ఏది అన్యాయం.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో డబ్బుల మాట అటుంచితే.. అప్పుల భారం మోపి వెళ్లిన కేసీఆర్… తన బీఆర్ఎస్ పార్టీ ఖజానాను మాత్రం ఓ రేంజ్ లో నింపుకున్నారు. ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతగా ఆస్తులు ఫండ్ సంపాదించి పెట్టారు. నెలనెలా కోట్లాది రూపాయలు వడ్డీ వచ్చేలా చూసుకున్నారు. తేడా అదీ.


గత పదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకం చేసి పడేశారు ఇదీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట. ఈ మాటను ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఎందుకు అంటుందో తెలుసుకోవాలంటే పదేళ్లు వెనక్కు వెళ్లాలి. 2014 నుంచి మొన్న కేసీఆర్ సర్కార్ దిగిపోయేదాకా ఏం జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం. ప్రజలకు అర్థమవడం ముఖ్యం. సొంత పార్టీ ఆస్తుల్ని డబుల్, ట్రిపుల్ చేసుకోవడంలో చూపిన శ్రద్ధ.. రాష్ట్ర సంపద, ఖజానా నిండుగా ఉండేలా చేయడంలో మాత్రం మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పుడు రోజూ ఓడీ కోసం ఆర్బీఐ దగ్గర చేతులు చాపే పరిస్థితికి తీసుకొచ్చారు. అది ఎలాగో చూద్దాం.

ఓసారి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ డిటైల్స్ చూద్దాం. అలాగే.. తెలంగాణ ప్రభుత్వ ఖజానా అకౌంట్ డిటైల్స్ కూడా చూద్దాం. ఫస్ట్.. బీఆర్ఎస్ అకౌంట్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 25న బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఎం. శ్రీనివాస్ రెడ్డి ఆడిట్ రిపోర్ట్ ను ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆ ప్రకారం చూస్తే.. పొలిటికల్ పార్టీలకు ఏటా వివిధ రకాలుగా సమకూరే ఆదాయానికి సంబంధించి ప్రాంతీయ పార్టీల విభాగంలో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2022–2023కు గాను దేశంలోనే అత్యధికంగా 683 కోట్ల 6 లక్షల 70 వేల 500 నిధులను బీఆర్ఎస్ సమకూర్చుకుంది. ఇందులో వ్యక్తులు, కంపెనీలు, సంస్థల నుంచి వచ్చిన విరాళాలు 64 కోట్ల 3 లక్షల 500 మేరకు ఉండగా.. ఎలక్టోరల్ ట్రస్ట్ ఫండ్స్ రూపంలో 90 కోట్లు.. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 529 కోట్ల 3 లక్షల 70 వేలు పార్టీ అకౌంట్ లో క్రెడిట్ అయింది.


బీఆర్ఎస్ కు విరాళాల రూపంలో దక్కిన 64.03 కోట్లలో ఆ పార్టీ నేతలు, వారి సన్నిహితులు ఇచ్చినవే ఎక్కువ ఉన్నాయి. ఈ లిస్ట్ లో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 10 కోట్లతో టాప్ లో నిలిచారు. గతేడాది సెప్టెంబర్ లో 5 కోట్ల చొప్పున రెండు విడతలుగా ఈ నిధులు చెక్కుల రూపంలో ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కుటుంబానికి చెందిన గాయత్రి గ్రానైట్ సంస్థ 10 కోట్లు, మాజీ మంత్రి మల్లారెడ్డి 2.75 కోట్లు, మల్లారెడ్డి సతీమణి కల్పన పేరిట 2.25 కోట్లు విరాళంగా అందాయి. రాజపుష్ప ప్రాపర్టీస్ 10 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వేములవాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన చల్మెడ నరసింహారావు ఫ్యామిలీకి చెందిన చల్మెడ ఫీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ 2 కోట్లు, విమలా ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్ల చొప్పున మొత్తం 4 కోట్లు బీఆర్ఎస్​ కు అందాయి. రోషిణి మినరల్స్ నుంచి 5 కోట్లు, హన్సా పవర్స్ అండ్ ఇన్​ ఫ్రాస్ట్రక్చర్ నుంచి 10 కోట్లు వచ్చాయి. ఎలక్టోరల్ ట్రస్ట్ ఫండ్స్ కింద ఫ్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి మూడు దఫాలుగా మొత్తం 90 కోట్లు అందాయి.

పార్టీపై అభిమానం ఉన్న వాళ్లు, సానుభూతి పరులు విరాళాలు ఇచ్చారు.. బీఆర్ఎస్ స్వీకరించింది. తప్పేం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ కు ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినా విరాళం ఇవ్వాలని ప్రయత్నించిన వారిని బెదిరించారని అప్పట్లో హస్తం నేతలు ఆరోపణలు కూడా చేశారు. తమకు ఇస్తే ఓకే.. ప్రత్యర్థికి ఇస్తే నాట్ ఓకే. ఇదీ బీఆర్ఎస్ నడిపించిన వ్యవహారం. సరే ఫండ్స్ సంగతి పక్కన పెడితే… బీఆర్ఎస్ పార్టీ సంపద పెంచుకోవడంలో చూపిన శ్రద్ధ, తెలంగాణ ప్రభుత్వ అకౌంట్ పై చూపకపోవడంపైనే ప్రశ్నలు వస్తున్నాయి. సొంత పార్టీపై సొంత ప్రేమ.. ప్రభుత్వ ఖజానాపై మాత్రం సవతి తల్లి ప్రేమ చూపించారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ ఖజానా ఖాళీ అవడమే కాదు.. అప్పుల కుప్ప వచ్చి పడింది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఖజానా చూస్తే గలగలమంటోంది. ఒకప్పుడు ఏమీ లేని పార్టీ గత పదేళ్లలో వేల కోట్లకు ఎదిగింది. అదే సమయంలో పాలన సాగించిన ఇదే గులాబీ పార్టీ.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ పట్టించింది. ఈ రెండూ వేర్వేరు అంశాలే అయినా.. కేసీఆర్ ఏం చేశారో అర్థం చేసుకోవడానికి ఈ రెండింటిని లింక్ చేయక తప్పదు.

బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయకపోయినా నెలనెలా ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈజీగా నడిచేలా చూసుకున్న కేసీఆర్… మరి రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత నడుస్తుందా నడవదా అన్న లెక్కలు ఎందుకు వేసుకోలేకపోయారు. తెలంగాణ కోసమే పని చేశాం. కడుపు కట్టుకుని కాపాడుకున్నాం అని చెప్పే వాళ్లు.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నడిరోడ్డుపై ఎందుకు వదిలేశారన్న ప్రశ్నలను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. అప్పులు తెచ్చి తెలంగాణలో సంపద సృష్టించామని చెబుతున్న బీఆర్ఎస్ నేతల మాటే నిజమైతే.. రోజూ ఆర్బీఐ దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ కోసం సర్కార్ నిలబడాల్సిన దుస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ప్రభుత్వ అకౌంట్ రోజుల తరబడి ఎందుకు ఖాళీగా ఉందన్న ప్రశ్నలకు జవాబేది? ఇంత చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఎందుకివ్వలేకపోయారు?

Related News

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Samantha: హేమా కమిటీ టాలీవుడ్ లో వేయాలన్న సమంత.. మరి జానీ మాస్టర్ కేసు పై నోరు మెదపదా..?

Manchu Vishnu: కల్తీ లడ్డూ.. ప్రకాష్ రాజ్ కి కౌంటర్.. పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన విష్ణు..!

Tollywood heroine: తెలుగు హీరోయిన్ భర్తకి యాక్సిడెంట్.. ఐసీయూలో చేరిక.!

Saripodhaa Sanivaram: 28 రోజులకే ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..?

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Big Stories

×