EPAPER

KTR BIG Shock To KCR: కేటీఆర్ తోనే.. కేసీఆర్ చెక్?

KTR BIG Shock To KCR: కేటీఆర్ తోనే.. కేసీఆర్ చెక్?

BRS పార్టీ, కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి చిట్ చాట్ వ్యాఖ్యలతో గులాబీ పార్టీలో అంతర్మథనం మొదలైందట. వందశాతం ప్రతిపక్షపాత్ర నెరవేరుస్తామని చెప్పిన కారు దళపతి.. ఫామ్‌ హౌస్‌కే పరిమితం కావటంలో.. పార్టీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొందట. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు. హరీష్‌రావు మాత్రం.. జిల్లాల పర్యటన, నియోజకవర్గ శ్రేణులతో మమేకం అవుతున్నారు. కేటీఆర్ గ్రేటర్ హైదరాబాదుకే పరిమితం కాగా.. అధినేత మాత్రం ఫామ్‌హౌస్‌ను వీడటం లేదు. అధికారం కోల్పోయి నాటి నుంచి ఇదే తంతు నడవటంతో BRS శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

కేసీఆర్ తీరుపై గులాబీ పార్టీ శ్రేణులు చాలా అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉండగా.. ఎన్నికల్లో వందశాతం విజయం ఖాయమని చెప్పటంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతానంటూ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఏమయ్యాయంటూ క్యాడర్‌ ప్రశ్నిస్తోందట. అధికారం కోల్పోయిన వారంతా ప్రతిపక్ష పాత్ర పోషించి.. ప్రభుత్వ నిర్ణయాలపై తమ అభిప్రాయాలను చెప్పాల్సింది పోయి ఫామ్‌హౌస్‌లోనే ఉండటం సరికాదని కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. ఇకనైనా కేసీఆర్‌.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అనే సందేహంతో ఉన్నామని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. గులాబీ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని టాక్ నడుస్తోంది.


Also Read: కావాలనే రచ్చ చేస్తున్నారు… నేను ఎలాంటి తప్పు చేయలేదు.

ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు.. కారు దిగి హస్తం గూటికి చేరారు.. రానున్న రోజుల్లో మరికొందరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కూమార్ గౌడ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో పార్టీ భవితవ్యం ఏంటనే అంశం తెరపైకి వచ్చిందట. ఎవరు వెళ్తున్నారు. ఎంతమంది ఆ జాబితాలో ఉన్నారనే చర్చ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఉన్న ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యక్రమంలో ఒకరు పాల్గొంటే.. మరొకరు దూరంగా ఉండటంతో అసలు ఏం జరుగుతుంనే భావనలో గులాబీ శ్రేణులు ఉన్నాయట. జిల్లాల పర్యటన చేస్తున్న హరీష్ రావు రైతు నిరసనల పేరుతో సభలు నిర్వహిస్తున్నా.. ఆ సభలకు రైతులే రావడం లేదని చర్చ సాగుతోంది. మరోవైపు మూసీ పేరుతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శను కూడా BRS మూటగట్టుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి వచ్చిన కవిత.. పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి చేసిన చిట్ చాట్ వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను కలవరపెడుతోందట.

చిట్‌ చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ బావమరిది పాకాల రాజ్‌ విందుపైనా హాట్‌ కామెంట్స్‌ చేశారు. మాకు దీపావళి పండుగ అంటే చిచ్చుబుడ్లని.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు అన్నారు సీఎం రేవంత్‌. దీపావళి దావత్‌ అలా చేస్తారని మాకు తెలియదని.. పాకాల రాజ్‌.. ఏం చేయకపోతే ఎందుకు పారిపోతారని సీఎం ప్రశ్నించారు. అతను ముందస్తు బెయిల్‌ ఎందుకు అడిగాల్సిన వచ్చిందన్నారు. ఇంటి దావత్‌ ఇస్తే… క్యాసినో కాయిన్స్‌ ఎందుకు దొరికాయని సీఎం ప్రశ్నించారు. అంతేకాదు.. కేసీఆర్‌ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుందన్నారు. సీఎం వ్యాఖ్యలపై కౌంటర్ ఇవ్వటం మాటెలా ఉన్నా.. ఎప్పుడు.. ఏం.. జరుగుతుందో తెలియక BRS శ్రేణులు ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.

Related News

Adi srinivas vs Harishrao: హరీష్‌రావు.. ఇంకా సిగ్గు రాలేదా? అంటూ విప్ శ్రీనివాస్ ఆగ్రహం

Janwada Farm House Case : కావాలనే రచ్చ చేస్తున్నారు… నేను ఎలాంటి తప్పు చేయలేదు.

Mayonnaise Ban : మాయదారి మయోనైజ్.. తింటే అంతే సంగతులు, రాష్ట్రంలో నిషేధం

Complaint to ED Against IAS: హాట్ టాపిక్‌గా ఐఏఎస్‌ల దందాలు.. నిన్న అమోయ్, నేడు నవీన్, సోమేశ్ లపై ఈడీకి ఫిర్యాదు

Drugs Case : రాజ్ పాకాలను 9 గంటల సుదీర్ఘ విచారణ.. పోలీసుల ప్రశ్నల వర్షం

Caste Census: ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేస్తా.. నాకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదు: కులగణన సమీక్షలో సీఎం రేవంత్

×