EPAPER

Rythu Bandhu Politics | తెలంగాణ ఎన్నికల్లో రైతు బంధు రాజకీయాలు.. బిఆర్ఎస్ కొత్త డ్రామా!

Rythu Bandhu Politics | రైతుబంధుపై తెలంగాణలో సరికొత్త రాజకీయం నడుస్తోంది. మరో రోజులో తమ ఖాతాల్లో రైతుబంధు నిధులు పడతాయనుకుంటున్న వేళ రైతుబంధును ఆపేయాలంటూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకోవడం కొంచెం బాధకరమైనా తప్పలేదని చెబుతోంది ఈసీ. మరి, ఇందుకు కారకులెవరు? ఇదే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని షేక్ చేస్తోంది.

Rythu Bandhu Politics | తెలంగాణ ఎన్నికల్లో రైతు బంధు రాజకీయాలు.. బిఆర్ఎస్ కొత్త డ్రామా!

Rythu Bandhu Politics | రైతుబంధుపై తెలంగాణలో సరికొత్త రాజకీయం నడుస్తోంది. మరో రోజులో తమ ఖాతాల్లో రైతుబంధు నిధులు పడతాయనుకుంటున్న వేళ రైతుబంధును ఆపేయాలంటూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకోవడం కొంచెం బాధకరమైనా తప్పలేదని చెబుతోంది ఈసీ. మరి, ఇందుకు కారకులెవరు? ఇదే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని షేక్ చేస్తోంది.


రైతుబంధు డబ్బులు ఖాతాల్లో వేయమని చెప్పింది ఎన్నికల సంఘమే. కానీ.. ఎందుకు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది? ఈ విషయం ఈసీ ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. మంత్రి హరీష్‌రావు ఒక నిబంధనను పదేపదే ఉల్లంఘించారు. రైతుబంధును ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. దీంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈసీ నిర్ణయంతో రైతులకు డబ్బు అందదని అధికార బీఆర్‌ఎస్‌ తెగ బాధపడుతోంది. ఇందుకు కాంగ్రెస్‌ నేత నిరంజన్ ఎన్నికల సంఘానికి రాసిన లేఖ కారణమంటూ ప్రజల మధ్య చెప్పారు మంత్రి హరీష్‌రావు.


ఇది నిజమైనా? కాంగ్రెస్ నాయకులు ఈసీకి లేఖ రాశారా? నిరంజన్ మాత్రం ఓ లేఖ రాసినమాట వాస్తవమే. అయితే.. అందులో ఏముందన్నది కీలకమైన విషయం. అదేంటో నిరంజన్ లేఖను స్వయంగా చదివి వినిపించారు బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు.

నిరంజన్ లేఖలో ఏముందో చదివి వినిపించిన కేకే.. రైతుబంధు డబ్బుల్ని ఆపమని కాంగ్రెస్ కోరినట్లు లేఖలో లేదని.. ప్రత్యర్థి పార్టీ అయినా తాను అబద్దం చెప్పలేనంటూ స్పష్టంగా కేకే చెప్పారు.

కానీ.. కేసీఆర్ మాత్రం హరీష్‌రావు తరహాలోనే మాట్లాడారు. రైతుబంధు ఆగిపోవడానికి పూర్తి కారణం కాంగ్రెస్‌ అనే ఇంకా ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నుంచి మొదలు పెడితే గల్లీలో ఉండే గులాబీ లీడర్ వరకు ఇదే విషయం చెబుతున్నారు. నిన్నటివరకు రైతుబంధు నిలిపేయడానికి ప్రయత్నించారని.. ఇప్పుడు ఈసీ అనుమతిస్తే తిరిగి దానిని నిలిపివేయించారన్నది బీఆర్‌ఎస్‌ నేతల మాట.

కాంగ్రెస్‌ కూడా బీఆర్‌ఎస్‌ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. సీఎం కేసీఆర్ కుట్ర, మంత్రి హరీష్‌రావు అతివాగుడు వల్లే రైతుబంధు ఆగిపోయిందని విమర్శించారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. తాము అధికారంలోకి రాగానే.. పట్టా రైతులకే కాదు, కౌలు రైతులకు, ఉపాధి కూలీలకు సైతం రైతు భరోసా అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ అసలు సంగతి. రైతుబంధు ఆగిపోయిన మాట వాస్తవం. బీఆర్ఎస్ బాధ పడుతోంది. కాంగ్రెస్ బాధ పడుతోంది. సీఈఓ వికాస్‌రాజ్ కూడా బాధ పడుతున్నారట. మరి, తప్పు ఎవరిది? రైతుల నోటి కాడ బువ్వ లాగేసింది ఎవరు? రైతుబంధు ఆగిపోవడానికి కాంగ్రెస్‌కు అసలు ఏ సంబంధం లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేత కేకే స్వయంగా మీడియా ముఖంగా సెలవిచ్చారు. కాంగ్రెస్‌ రాసిన లేఖలో కూడా ఎక్కడా రైతుబంధు నిలిపేయాలని కోరలేదని ఆయనే క్లారిటీ ఇచ్చారు.

అందరి వేళ్లూ హరీష్‌రావు వైపే. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, మధ్యలో ఈసీ కూడా హరీష్‌వల్లే డబ్బులు ఆగాయని స్పష్టంగా చెప్తున్నారు. అసలు, రైతుబంధు నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతించినప్పుడు.. దాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకోవద్దని సూటిగా ఓ కండిషన్ పెట్టింది. కానీ.. హరీష్‌రావు చేసిందేంటి? ఎక్కడ సభ నిర్వహించినా రైతుబంధును ప్రస్తావించారు. కాంగ్రెస్ అడ్డుపడినా.. ఆమోదం లభించిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏం చేయాలో పాలుపోక తాము ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంది. ఈసీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని కూడా చెప్తున్నారు.

సో, హరీష్‌ రావు వల్లే రైతుబంధు ఆగిందని స్పష్టమైంది. వాట్ నెక్స్ట్? ఇప్పుడేంటి? రైతులు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందేనా? అసలు, ఆర్థికమంత్రిగా ఉన్న హరీష్‌రావు ఎందుకు పదేపదే ఎన్నికల సంఘం పెట్టిన కండిషన్‌ను ఉల్లంఘించారు? రైతు బంధు ఇచ్చేందుకు ఖజానాలో డబ్బులున్నాయా? కాంగ్రెస్ నాయకులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. రైతు రుణమాఫీ కూడా నిధుల్లేక ఆగాయంటూ మంత్రి కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు.

మొత్తంగా చూస్తే ఖాజానాలో నిధులు లేక గులాబీ పార్టీ సరికొత్త పొలిటికల్ డ్రామాకు తెరతీశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×