EPAPER

Mlc Elections : బీఆర్ఎస్ సంచలన నిర్ణయం..! ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం..!

Mlc Elections : ఇన్నేళ్ల పాటు ఎన్నికలు ఏవైనా విక్టరీ తమదే అన్నట్టుగా ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వచ్చిన భారత్‌ రాష్ట్ర సమితి ఇప్పుడో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని బీఆర్‌ఎస్‌ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 11న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడనుంది.

Mlc Elections : బీఆర్ఎస్ సంచలన నిర్ణయం..! ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం..!

Mlc Elections : ఇన్నేళ్లూ ఎన్నికలు ఏవైనా విక్టరీ తమదే అన్నట్టుగా ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడో సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికలకు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఈ నెల 29న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీఆర్‌ఎస్‌ డిసైడ్ అయిందని తెలుస్తోంది. ఈ నెల 11న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడనుంది.


వాస్తవానికి ఈ రెండు స్థానాలు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయినవే. అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పాడి కౌశిక్‌ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే తగినంత ఎమ్మెల్యేల సంఖ్య లేకపోవడంతో మొత్తానికే ఎన్నికల బరిలోకి దిగకుండా తప్పుకుంటోంది బీఆర్‌ఎస్‌.

విపక్ష పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఇక లాంఛనమే. అయితే ఎవరిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటిస్తారనే ఆసక్తి నెలకొంది.


Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×