EPAPER

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

BRS Mlc Kavitha: కవిత రాజకీయ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? కీలక నేతల నుంచి ఆమెకు సానుకూల సంకేతాలు వచ్చాయా? సెంటిమెంట్‌ని కవిత నమ్ముకున్నారా? లోకల్ బాడీ ఎన్నికలే ఈమెకు టాస్కా? స్థానిక ఎన్నికల్లో పార్టీని గట్టెక్కిస్తే.. అధ్యక్షురాలి పీఠం దక్కేనా? ఇదే చర్చ బీఆర్ఎస్‌లో జోరుగా సాగుతోంది.


రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ కానుంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ వేగంగా జరిగింది. గడిచిన వారంరోజులుగా తన నివాసంలో పార్టీకి చెందిన కీలక నేతలతో మంతనాలు సాగించారామె. వారి నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది.

ఎప్పుడు? ఎలా? చేయాలన్న దానిపై చర్చలు జరిపారు. పార్టీ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న ఆమె, ఆయా విషయాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ల నున్నారు. ఏమైనా మార్పులు చేర్పులు చేసిన తర్వాత బరిలోకి దిగనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ ఒకటి లేదా రెండు ముహూర్తం పెట్టినట్టు గులాబీ వర్గాలు చెబుతున్నాయి.


తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు బతుకమ్మ. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత బతుకమ్మ సంబరాలను రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను నిర్వహించింది బీఆర్ఎస్ సర్కార్. బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మ అనే విధంగా క్రియేట్ చేసుకుంది. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా తిరిగి పరిచయం చేసింది కవిత. పొలిటికల్ రీఎంట్రీకి బతుకమ్మ ఫెస్టివల్‌ను ఉపయోగించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

ముఖ్యంగా మహిళలను ఆకట్టుకోవాలని ఆలోచన చేస్తోంది బీఆర్ఎస్. కవిత అయితే కరెక్ట్‌గా సెట్ అవుతుందన్నది ఆ పార్టీ ఆలోచన. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీకి సహాయ పడుతుందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో అక్టోబరు ఒకటి లేదా రెండున ముహూర్తం ఫిక్స్ చేసినట్టు ఆ పార్టీ అంతర్గత సమాచారం.

సింపుల్‌గా చెప్పాలంటే కవిత రీఎంట్రీ ఆమెకొక పెద్ద టాస్క్. (సినిమాటిక్‌గా చెప్పాలంటే.. బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం బాధ్యతలు చేపట్టాలంటే కాళకేయుడ్ని వధించిన వారికే పగ్గాలంటూ శివగామి చేసిన స్టేట్‌మెంట్ లాంటిది).

కవిత రీఎంట్రీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు పుంజుకుంటే ఆమెకే పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరికొందరు మాత్రం ఆమె జాతీయ రాజకీయాలైతే బెటరని అంటున్నారు. గతంలో కూడా తన వాణి బలంగా వినిపించిందని అంటున్నారు.

తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు ప్రీ బస్సు సౌకర్యం కలిపించారు. మహిళల ఓటు బ్యాంకు కాంగ్రెస్ పడుతుందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. దాన్ని విడగొట్టాలన్నది కవిత స్కెచ్‌గా చెబుతున్నారు. అందుకే బతుకమ్మ ఫెస్టివల్‌ను వేదికగా మార్చుకుందన్నది కొందరి నేతల మాట. రీఎంట్రీ సమయంలో లిక్కర్ స్కామ్ గురించి ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశముందని ఆ పార్టీ వర్గాల మాట.

Related News

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Big Stories

×