EPAPER

TS Assembly: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన.. డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

TS Assembly: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన.. డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

BRS Party: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మంగళవారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హాట్ హాట్‌గా డిబేట్ జరిగింది. సివిల్ సప్లై పద్దుల విషయమై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. వెల్‌లోకి దూసుకొచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలకు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవివరింగా సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇది సభనా? బస్టాండా? అంటూ ఆగ్రహించారు. సభా మర్యాదలు కాపాడేవాళ్లు మాత్రమే సభలో ఉండాలన్నారు. తాము స్లోగన్లకు భయపడేవాళ్లం కాదని స్పష్టం చేశారు. తాను కూడా సీఎల్పీ నాయకుడిగా చేశానని, కానీ, తాము ఎప్పుడైనా ఇలా వ్యవహరించామా? అని ప్రశ్నించారు.


తెల్ల రేషన్ కార్డుల అంశంపై కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇక కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై శాఖలో భారీ అవినీతి జరిగిందని, రూ. 1,100 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ఈ స్కాంపై హౌజ్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మిల్లర్ల నుంచి ధాన్యం తీసుకోవాలని, డబ్బులు కాదని గంగుల కామెంట్లు చేశారు. మద్దతు ధర ఇస్తామని ఇవ్వలేదని, ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సివిల్ సప్లై శాఖలో స్కాం ఏమీ జరగలేదని, అన్నీ పారదర్శకంగా చేపడుతున్నామని స్పష్టం చేశారు. ధాన్యానికి బోనస్ అందించే విషయంపై మాట్లాడుతూ.. సన్న వడ్లను ప్రోత్సహించాలనే ఆలోచనతో క్వింటాల్ సన్న వడ్లకు రూ. 500 ఇస్తామన్నారు. ఇది తమ పాలసీ అని వివరించారు. తాము అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నా బీఆర్ఎస్ ఎందుకు ఆందోళన చేస్తున్నదని ఫైర్ అయ్యారు.


Also Read: నాలుగు రోజులకే రికార్డ్ కలక్షన్స్ రాబట్టి షాక్ ఇస్తున్న రాయన్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును డిప్యూటీ సీఎం భట్టి తప్పుబడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిన సివిల్ సప్లై శాఖను మంత్రి ఉత్తమ్ కుమార్ గాడిలో పెడుతున్నారని చెప్పారు. ధాన్యం విషయంలో ప్రభుత్వం ఇంకా పూర్తి వివరాలు చెప్పాల్సి ఉన్నదని వివరించారు. దానిపై ప్రత్యేక చర్చకు కూడా ప్రభుత్వం సిద్ధమేనని స్పష్టం చేశారు. అయినా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు, నిరసనలు చేయడంతో.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎప్పుడైనా ఇలా వ్యవహరించామా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఏనాడైనా వెల్‌లోకి దూసుకువచ్చామా? అని అడిగారు.

సభ రేపటికి వాయిదా పడింది. 19 పద్దులకు సభలో ఆమోదం లభించింది.

Related News

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Big Stories

×