EPAPER

BRS vs CONGRESS: ఆగేదిలేదు.. కాంగ్రెస్ దెబ్బకు కేసీఆర్ మైండ్ బ్లాక్

BRS vs CONGRESS: ఆగేదిలేదు.. కాంగ్రెస్ దెబ్బకు కేసీఆర్ మైండ్ బ్లాక్

BRS MLAs Joining into Congress Party: దెబ్బ మీద దెబ్బ.. షాక్‌ మీద షాక్.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీ సీన్‌ క్లైమాక్సే.. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే జంప్ అవుతాడో తెలియదు. ఫామ్‌హౌస్‌లో ఉన్న పెద్దాయనకు అస్సలు మనఃశాంతిని ఇవ్వడం లేదు బీఆర్ఎస్‌ పార్టీ నేతలు. ఇప్పుడీ విషయాలన్నింటిని చెప్పుకోవడానికి ఓ రీజన్ ఉంది. అదేంటో మీరూ చూడండి.


చేరిక ఫిక్స్.. ముహూర్తం ఖరారు.. అని అర్ధం అయ్యేటట్లు చెప్పేశారు రాజేంద్రనగర్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్.. ఆయన మరో క్లారిటీ ఇచ్చేశారు. తనను ఎవరూ సంప్రదించలేదు. ఎవరూ బెదిరించలేదు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం నేనే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని క్లారిటీ ఇచ్చేశారు ప్రకాశ్‌గౌడ్.. కాబట్టి బీఆర్ఎస్‌ నుంచి మరో ఎమ్మెల్యే ఔట్ అయిపోయారు. అయితే బీఆర్ఎస్‌ పెద్దలకు ఇది కాదు బ్రేకింగ్ న్యూస్. దీనికి మించినది ఉంది.

బీఆర్‌ఎస్‌లో మిగిలేది ఎంత మంది? ఒకప్పటి అదే బీఆర్ఎస్‌ నేత అయిన దానం నాగేందర్ మాటల్లో చెప్పాలంటే.. ముగ్గురు లేదా నలుగురు. ఈ ఫిరాయింపులకు సంబంధించి న్యాయపోరాటం చేసుకోండని ఆయన సవాల్ కూడా విసురుతున్నారు. ఆయన ఇంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న నేత ఇంత ఘాటుగా రియాక్ట్ అవ్వడానికి రీజనేంటి? సింపుల్.. ఆత్మగౌరవం దెబ్బతినడం. ఎమ్మెల్యేలమైనా మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా ట్రీట్ చేయలేదు. ఓ చీడ పురుగును చూసినట్టు చూశారు. అందుకే చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారని బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. నిజానికి పరిస్థితులు చూస్తుంటే ఆయన మాటలు నిజమయ్యేలానే ఉన్నాయి.


మరికొన్ని గంటల్లోనే గ్రేటర్‌ ఏరియాలోని అన్ని నియోజకవర్గాల బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరంతా బీఆర్ఎస్‌ పార్టీ మీటింగ్స్‌కు మొఖం చాటేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పాలకమండలి మీటింగ్‌కు కూడా డుమ్మా కొట్టారు.
దీంతో గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటికే దెబ్బ మీద దెబ్బలా నేతల వలసల షాక్‌ తగులుతోంది. ఇప్పుడు జరగబోయే పరిణామాలను చూసేందుకు బీఆర్ఎస్‌ పెద్దలు గుండెను రాయి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ నెలాఖరు వరకు ఈ చేరికలను పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ టార్గెట్.. ఆలోపు బీఆర్‌ఎస్‌ఎల్పీని విలీనం చేయాలని కాంగ్రెస్‌ ఆలోచన. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అంతకుముందే కాంగ్రెస్ ఈ టార్గెట్‌ను రీచ్‌ అయ్యేలా కనిపిస్తోంది.

Also Read: ‘గ్రేటర్ ’లో కరెంట్ ఫికర్.. ఉక్కపోతలు కంటిన్యూ

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద.. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మార్రి రాజశేఖర్ రెడ్డి..
సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్.. ఈ లిస్ట్‌లో ఉన్న ఒకరిద్దరు తప్ప.. అందరి దారి కాంగ్రెస్‌ వైపే అన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి తలసానికి కూడా పార్టీలో చేరమని రాయబారం వెళ్లినట్టు తెలుస్తోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. మొత్తానికి కార్పొరేషన్ ఎన్నికల నాటికి గ్రేటర్‌ ఏరియాలో బలపడాలన్నది కాంగ్రెస్ ఆలోచన.. పరిణామాలు చూస్తుంటే బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇది గ్రేటర్ విషయం.. ఇక స్టేట్‌వైడ్‌గా చూసుకుంటే.. బీఆర్ఎస్‌కు ఉన్న ఎమ్మెల్యేలలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని చూస్తోంది కాంగ్రెస్.. అందుకే అడుగులు వేగంగా వేస్తోంది. అయితే ఈ చేరికలపై బీఆర్ఎస్ కూడా గట్టిగానే పోరాడుతోంది. స్పీకర్‌కు లేఖలు రాస్తూ.. కోర్టులను కూడా ఆశ్రయిస్తుంది. బట్ ఎలాంటి ఫలితం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్‌ఎల్పీ విలీనమవుతుందన్న క్లారిటీ వచ్చింది. దీంతో ఎలాంటి భయం లేకుండా కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు.
పార్టీ ఆపద సమయంలో ఉంటే కనీసం కాపాడుకోవడానికైనా ప్రయత్నించాల్సిన పెద్దలు.
ఒకరు ఫామ్‌హౌస్‌కే పరిమితం కాగా.. మరో ఇద్దరు ఢిల్లీలో కవిత బెయిల్‌ కోసం కాళ్లబేరాలు, రాయబారాలతో బిజీగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌కు పని మరింత ఈజీగా అయిపోయింది.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×