EPAPER

BRS MLA Lasya Nanditha Dies in Car Accident: BRS కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

BRS MLA Lasya Nanditha Dies in Car Accident: BRS కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

BRS MLA Lasya Nanditha Died in Car Accident: దివంగత ఎమ్మెల్యే కుమార్తె, కంటోన్మెంట్‌ BRS ఎమ్మెల్యే లాస్య నందిత (37) మృతి చెందారు. పటాన్ చెరు ORRపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న XL కారు ఓఆర్ఆర్‌పై అదుపుతప్పి డివైడర్‌‌ను ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై.. అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో పీఏ ఆకాశ్, కారు డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లాస్య నందిత మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.


కొన్ని రోజుల క్రితం నల్గొండలో నార్కట్ పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె గాయపడి కోలుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీ కొట్టడంతో.. తలకు గాయాలయ్యాయి. అప్పట్లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కానీ.. ఇప్పుడు మరోసారి రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె.. స్పాట్‌లోనే చనిపోవడం అభిమానుల్ని శోకసంద్రంలోకి నెట్టింది. లాస్య నందిత మరణవార్తతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, శ్రేణులంతా షాక్ కు గురయ్యారు. ఆమె అకాలమరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి చెందారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సంతాపం ప్రకటించారు.

Read More: బాసర ట్రిపుల్‌ ఐటీలో విషాదం.. హాస్టల్ గదిలో విద్యార్థిని సూసైడ్


గతేడాది ఫిబ్రవరి 19న లాస్య నందిత తండ్రి, బీఆర్ఎస్ నేత సాయన్న మరణించారు. ఆయన మృతి చెందిన ఏడాదికే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులను శోక సంద్రంలోకి నెట్టేసింది. ఆమె వ్యక్తిగత జీవితంలో, రాజకీయాల్లో తండ్రి తన తొలి గురువు అని ఒక ఇంటర్వ్యూలో తెలిపిందామె. కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన లాస్య నందిత.. తండ్రి కోసం రాజకీయాలవైపు అడుగులు వేసింది. 2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీ చేసిన లాస్య నందిత.. అదికొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడీగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు.

2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్లీ ఓటమిని చూడక తప్పలేదు. తండ్రి సాయన్న మరణంతో.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్ఠానం కంటోన్మెంట్ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో లాస్యనందిత మెజార్టీ ఓట్లతో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు.

Tags

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×