EPAPER

Jagadish Reddy supporters fighting: యశోదా ఆసుపత్రి.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుల ముష్టిఘాతాలు.. ఆపై

Jagadish Reddy supporters fighting: యశోదా ఆసుపత్రి.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుల ముష్టిఘాతాలు.. ఆపై

Jagadish Reddy supporters fighting: యశోద ఆసుపత్రిలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరులు హంగామా సృష్టించారు. చిలుకా ప్రవీణ్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతడ్ని పరామర్శించేందుకు జగదీశ్‌రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లారు. ఈ సమయంలో భద్రతా సిబ్బందికి, మాజీ మంత్రి అనుచరులకు మధ్య గొడవ జరిగింది. సిబ్బందిపై ఆయన అనుచరులు పిడిగుద్దుల వర్షం కురిపించారు.


వీడియోలో కనిపిస్తున్న పెద్దాయన పేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి. గడిచిన పదేళ్లు మంత్రిగా పని చేశారు కూడా. ఆయన అనుచరులు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో వీరంగం సృష్టించారు. అసలేం జరిగిందన్న డీటేల్స్ లోకి ఒక్కసారి వెళ్దాం.

చిలుక ప్రవీణ్‌కుమార్‌ అనే యూట్యాబర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతడ్ని సోమాజీగూడ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతన్ని పరామర్శించేందుకు ఆసుపత్రి వచ్చారు బీఆర్‌ఎస్ నేతలు. అందులో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆయన అనుచరులున్నారు.


జగదీశ్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ యశోదా ఆసుపత్రి స్టాప్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. మమ్మల్ని అడ్డుకుంటారా అక్కడి స్టాప్‌పై చిందులేశారు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరులు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అక్కడే ఉన్నారు.

ALSO READ: కొండకల్ తండాలో ఏం జరుగుతోంది..? ‘స్వేచ్ఛ’ వార్తలతో విషయం వెలుగులోకి..

ఆగ్రహంతో ఊగిపోయిన మాజీ మంత్రి అనుచరులు ఆసుపత్రి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు వర్షం కురిపించారు. దీంతో భయభ్రాంతులకు గురయ్యారు యశోద సిబ్బంది. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నేతల దాడి దృశ్యాలపై నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

 

Related News

Kondakal: కొండకల్ తండాలో ఏం జరుగుతోంది..? ‘స్వేచ్ఛ’ వార్తలతో విషయం వెలుగులోకి..

TG Govt: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఆ రైతన్నలకు రూ.500 బోనస్.. 48 గంటల్లో డబ్బు జమ

Minister Sridharbabu: వాళ్లతో నష్టపోవడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు: మంత్రి శ్రీధర్ బాబు

Rain Alert: రేపటి నుండి వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలలో మాత్రం అంతంత మాత్రమే.. మరికొన్ని జిల్లాలలో..

Harishrao: ఆరునూరైనా అడ్డుకుని తీరుతా.. అవసరమైతే అక్కడికి కూడా వెళ్తా: హరీష్ రావు

Tummala: మోసగాళ్ల మాటలు నమ్మొద్దు.. రైతు భరోసా ఆగదు: మంత్రి తుమ్మల

Big Stories

×