EPAPER

Revanth Reddy: హరీశ్ రావు.. ఇక తప్పుకో.. : సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

Revanth Reddy: హరీశ్ రావు.. ఇక తప్పుకో.. : సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

Harish Rao: ‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు లక్షల రైతు రుణమాఫీ హామీ బూటకమనీ, అదే జరిగితే తాను సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్‌ చేశారు. నేటితో మొత్తం రుణమాఫీ అమలు చేసి చూపించాం. కనుక.. తాను అన్నమాటకు కట్టుబడి తక్షణం హరీశ్‌రావు రాజీనామా చేయాలి. లేదా అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి, తన మాటను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చివరి విడత రైతు రుణమాఫీ సందర్భంగా.. ‘సాగుకు జీవం.. రైతుకు ఊతం’ పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.


రుణమాఫీ పూర్తి..
వైరా సభలో రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల్లోపు రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అనంతరం పలువురికి మూడో విడత రుణమాఫీ చెక్కులను అందించి, ఆ వెంటనే రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా రైతులను రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం రూ.31 వేల కోట్లు కేటాయించిందని, తొలి విడతగా రూ.లక్ష లోపు ఉన్న రుణాల మాఫీకి జులై 18న రూ.6034 కోట్లు, మలివిడతలో జులై 30న రూ. 6190 కోట్లతో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేశామన్నారు. తుది విడతగా నేడు 18 వేల కోట్లతో రూ. రెండు లక్షల లోపున్న రుణాలను మాఫీ చేశామన్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తం రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. నాటి బ్రిటిష్ పాలకుల నుంచి కాంగ్రెస్ దేశాన్ని విముక్తం చేస్తే.. నేడు అదే పార్టీ తెలంగాణ రైతులను రుణ విముక్తులను చేసిందన్నారు.

2026 నాటికి..
‘2022 మే 6 న తమ నేత రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేశాం. ఖమ్మం గడ్డ కాంగ్రెస్‌ అడ్డా. ఖమ్మం జిల్లా రైతాంగానికి అండగా నిలిచేందుకే ఈ ప్రాంతానికి వచ్చా. 2026 పంద్రాగస్టు లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. నియోజకవర్గానికి 3,500 చొప్పున తెలంగాణలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం. ఆరు గ్యారంటీల అమలుకు నిరంతరం కష్టపడుతున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.


Also Read: ISRO: మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. ఉదయం 9.17 గంటలకు ప్రయోగం

హరీష్ తప్పుకో..
నేటితో రుణమాఫీ పూర్తయినందున.. చీము నెత్తురు, సిగ్గు, శరం ఉంటే హరీశ్ రావు.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలన్నారు. హరీశ్ రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ విరగడ అవుతుందని ధ్వజమెత్తారు. సిద్దిపేటలో హరీష్‌ను ఓడించే బాధ్యత తనదేనని బహిరంగ సవాల్ చేశారు. ఒకవేళ రాజీనామా చెయ్యకపోతే అమరుల స్థూపం దగ్గర హరీష్ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్. కేసీఆర్ సర్కారు ఖమ్మం రైతులకు నాడు బేడీలు వేసి జైల్లో పెట్టిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి జనం గుండు సున్నా ఇచ్చినా ఇంకా బుద్ది రాలేదన్నారు. ప్రజలే తప్పు చేశారన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ బస్టాండ్‌లో అడుక్కుతినాల్సిందేనన్నారు.

దమ్ముంటే చర్చకు రండి..
వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క గులాబీ నేతలకు విసిరిన సవాలును వారు స్వీకరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఏ సెంటర్‌లోనైనా బీఆర్ఎస్ పార్టీతో తాము చర్చకు సిద్ధమని, హరీశ్, కేటీఆర్ ఎవరొచ్చినా తాము రెడీ అన్నారు. అమరవీరుల స్థూపం వద్దనైనా చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలకు ప్రజల కష్టాలు పట్టించుకోలేదని, విపక్షంలోకి రాగానే తెగ బాధ పడుతున్నారన్నారు. వారి ప్రచారాన్ని నమ్మాల్సిన పని లేదన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 సీట్లు ఇస్తే.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వాళ్లు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు.

Related News

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Big Stories

×