EPAPER
Kirrak Couples Episode 1

Brs Harish Rao : ఇక చాలు, ఆపేయండి… లేకుంటే బుల్డోజర్లకు అడ్డం కూర్చుంటాం

Brs Harish Rao : ఇక చాలు, ఆపేయండి… లేకుంటే బుల్డోజర్లకు అడ్డం కూర్చుంటాం

– కూల్చివేతలపై బీఆర్ఎస్ పోరుబాటు
– హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతారా?
– పేదలకో న్యాయం.. పెద్దలకు మరొకటా?
– ఇక.. బుల్డోజర్లకు అడ్డం పడుకుంటాం
– పథకాలకు లేని డబ్బులు ఇప్పుడెలా వచ్చాయి ?
– మాజీ మంత్రి హరీష్ రావు


హైదరాబాద్, స్వేచ్ఛ :  అక్రమ నిర్మాణాలపై రాజీ పడనంటూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముందుగా కొడంగల్‌లో కుంటలో కట్టిన తన ఇంటి గురించి ప్రస్తావించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం రాజధానిలోని హైదర్‌షాకోట్‌లో మూసీ బాధితుల ఇండ్లను పార్టీ నేత‌లు హ‌రీశ్‌రావు, స‌బితా ఇంద్రారెడ్డి, మ‌ల్లారెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్‌తో పాటు ప‌లువురు నేత‌లు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మూసీ బాధితుల‌కు బీఆర్ఎస్ నేత‌లు ధైర్యం చెప్పారు. బాధితులకు అండ‌గా ఉంటామ‌ని ప్రకటించారు.

ముఖ్యమంత్రి ఇల్లు సంగతేంటి ?


‘కొడంగల్‌లోని సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు సర్వే నంబర్ 1138లో ఉంది. కుంటలో ఉన్న ఆ ఇంటిని ముందు కూలగొట్టించాలి. అలాగే, దుర్గం చెరువు ఒడ్డున ఉన్న మీ సోదరుడి ఇల్లూ..ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. దానికి నోటీసులిచ్చి సరిపెట్టారు. మీ కుటుంబానికి ఒక రూల్, గరీబులకో నియమం ఉంటుందా?’ అని నిలదీశారు. పేదలకు నీడ లేకుండా చేసేందుకే మూసీ కూల్చివేతలు మొదలుపెట్టారని ఆరోపించారు.

రూ. 150 కోట్లు కూడా లేవా ?

ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం రూ. 1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణకు డీపీఆర్ రెడీ చేస్తున్న సర్కారు.. రూ.150 కోట్లతో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేకపోవటం వింతగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్‌ లేవని, సర్కారు ఆసుపత్రుల్లో మందులు లేవని, 7 నెలల నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు రావట్లేదన్నారు. పాలన పక్కనపెట్టి మూసీ సుందరీకరణ అంటూ పేదల ఇండ్లు కూల్చే పనికి పూనుకోవటమేంటో అర్థం కావటం లేదన్నారు. మూసీలో మురికి నీరు రాకుండా చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కూలిపోయిందంటూనే అక్కడి నుంచే గోదావరి నీళ్లు తెస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.

గుర్తు మార్చుకోండి..

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడుతున్న ఇండ్లన్నీ 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడిచ్చిన పట్టాల్లో కట్టినవేనని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ప్రభుత్వ తప్పిదాలకు పేదలకు ఎందుకు బలికావాలి..? ఇందిరమ్మ పాలన అంటే పేదలకు కూడు, గుడ్డ, నీడ ఇచ్చేదని, కానీ మీ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నమన్నారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందనీ, ఇకనైనా కాంగ్రెస్ హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

అడ్డం కూర్చుంటాం…

పేదలఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీష్ స్పష్టం చేశారు. హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, హైడ్రా పేరుతో బలవంతంగా ఇండ్లు ఖాళీ చేయిస్తామంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఇకపై, బీఆర్ఎస్ తరపున బుల్డోజర్లకు అడ్డంగా కూర్చుంటామని, అయినా ఇళ్లను కూల్చాలనుకుంటే తమ మీది నుంచి బుల్‌డోజర్లు వెళ్లాల్సి ఉంటుందని ప్రకటించారు.

Related News

Ponnam Prabhakar : హస్తం ఆదుకుంటుంది… కారు ట్రాప్‌లో పడొద్దు

Hydra: మీ ఇల్లు చెరువుల పరిధిలో ఉందా ? ఇలా చెక్ చేసుకోండి

Dcm Mallu Bhatti Vikramarka : ప్రజాస్వామ్య తెలంగాణ అంటే ఏంటో మా పాలనతో చూపిస్తాం

Hyderabad Rains : మళ్లీ షురూ… హైదరాబాద్ మహానగరంలో వర్షం

Hydraa : హైడ్రా అంటే ఒక భరోసా.. రంగనాథ్‌నే ఏరికోరి తేవడానికి కారణాలు ఇవే!

Minister Sridhar Babu: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్స్

Big Stories

×