EPAPER

HarishRao as PAC Chairman: హరీష్‌రావు పీఏసీ ఛైర్మన్ అయితే, కేటీఆర్‌ మాటేంటి?

HarishRao as PAC  Chairman: హరీష్‌రావు పీఏసీ ఛైర్మన్ అయితే, కేటీఆర్‌ మాటేంటి?

HarishRao as PAC Chairman: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయా? అసెంబ్లీలో పదవుల కోసం ఆ పార్టీలో నేతల మధ్య పోటీ పెరిగిందా? కేసీఆర్ ఆలోచన విధానం ఎలా వుంది? హరీష్‌ రావు పీఏసీ ఛైర్మన్ అయితే.. కేటీఆర్ మాటేంటి? ఇలా రకరకాలుగా ఆ పార్టీ నేతలు చర్చించుకుంటు న్నారు.


శాసనసభలో పీఏసీ, కమిటీల్లో నియమించే సభ్యుల పేర్లు ఇవ్వాలని పార్టీలకు సూచించారు స్పీకర్ ప్రసాద్‌కుమార్. ఆయన ఆదేశాల మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ పార్టీలు తమ ప్రతిపాదన లను అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చాయి. శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా హరీష్‌రావు ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నార్మల్‌గా ప్రధాన ప్రతిపక్షానికి పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ లెక్కన ఆ పదవి రేసులో హరీష్‌రావుకు దాదాపుగా ఓకే అయినట్టే.

ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. అందులో ఒకరు గంగుల కమలాకర్ కాగా, మరొక పేరు పెండింగ్‌లో పెట్టింది. అయితే పీఏసీ ఛైర్మన్ పదవి తొలుత సబిత ఇంద్రారెడ్డికి ఇస్తారంటూ వార్తలు వచ్చాయి. సడన్‌గా తెరపైకి హరీష్‌రావు పేరు వచ్చింది. దీంతో పదవు లను కేసీఆర్ తమ ఫ్యామిలీకే ఇస్తున్నారనే గుసగుసలు అప్పుడు మొదలయ్యాయి.


ALSO READ: దటీజ్ అమ్రపాలి ..ఆమె రూటే సెపరేటు

ఇంతవరకు బాగానే హరీష్‌రావు పీఏసీ ఛైర్మన్ అయితే.. కేటీఆర్ పరిస్థితి ఏంటన్నది కొందరి ప్రశ్న. యువ నేతకు ప్రత్యేకంగా పదవులు ఇవ్వాల్సిన అవసరంలేదని, ఆల్రెడీ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఇక కేసీఆర్ ప్రతిపక్షనేతగా కొనసాగుతున్నారు. ఈ పదవుల విషయంలో కారు పార్టీలో చాలా మంది నేతలు గుర్రుగా వున్నట్లు తెలుస్తోంది.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×