EPAPER

Land Kabza : కబ్జా గులాబీలు.. కన్ను పడిందంటే అంతే..

Land Kabza : గులాబీ పాలనలో తెలంగాణ మాగాణిలో కబ్జాలు మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా సాగాయి. భూమి ప్రైవేటుదైనా.. ప్రభుత్వానిదైనా.. గులాబీ నేతల కన్ను పడిందంటే వారి పరం కావాల్సిందే అన్నట్టుగా పరిస్థితి ఉందని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇన్నాళ్ల పాటు అధికార పరదాను అడ్డుపెట్టి దాచేసిన అవినీతి బాగోతాలన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో నెంబర్‌ టూ.. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న నేత కనుసన్నల్లో సాగిన ఓ కబ్జా పర్వం ఇన్నాళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఖతర్నాక్‌ ప్లాన్‌తో సర్వే నంబర్లు మాయం చేసి పదంటే పదే రోజుల్లో ఫైల్స్ కదిలించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసేశారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని 462 సర్వే నెంబర్‌లో మొత్తం మూడు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. దీన్ని చాలా నైస్‌గా.. పకడ్బందీ ప్లాన్ ప్రకారం కాజేశారు. అందులో భాగంగా నల్లగొండ జిల్లాకు చెందిన కొలిశెట్టి వెంకయ్య అనే స్వాతంత్ర సమరయోధుడి మరణం తర్వాత.. ఆమె భార్య వజ్రమ్మకు 300 గజాల భూమిని అలాట్‌ చేసింది ప్రభుత్వం. అయితే 2023 జనవరిలో వజ్రమ్మ కూడా కాలం చేయడంతో.. ఆ భూమిని సదరు రిపోర్టర్‌ తండ్రి అయిన కొలిశెట్టి యాదగిరి రావు పేరు మీదకు మార్చుకున్నారు. అక్కడ ఇల్లు కూడా కనస్ట్రక్షన్ చేస్తున్నారు. ఇందులో తప్పేముంది.. అంటారేమో.. అక్కడే ఉంది అసలు కిటుకు. ఆ సర్వే నంబర్‌లో 300 గజాలు పోగా మిగిలిన మూడెకరాల భూమి కూడా మాయమవడం హైలెట్ అని చెప్పాలి.

నిజానికి ఈ మొత్తం సీన్‌ చూస్తుంటే.. అసలు ఫ్రీడమ్ ఫైటర్‌కు భూమి కేటాయించడం అనేదే ఈ భూమిని కొట్టేసే స్కెచ్‌లో భాగమని అర్థమవుతోంది. చిన్న పని కోసం వెళితేనే ముప్పై సార్లు తిప్పి.. మూడు చెరువుల నీళ్లు తాగించే అధికారులు.. ఈ భూమి విషయంలో భూమి అలాట్‌మెంట్, ఆమె మరణం తర్వాత కొడుకు పేరు మీదకు బదలాయింపు.. ఇళ్లు నిర్మాణానికి పర్మిషన్.. ఆఖరికి రైతు బంధు నిధులు కేటాయించడం కూడా జరిగిపోయింది. పై నుంచి ఏ రేంజ్‌లో ఒత్తిడి ఉంటే ఈ రేంజ్‌లో పని జరుగుతుందో చిన్న పిల్లాడిని అడిగినా తెలిసిపోతుంది. అలా ఉంటుంది మరి మంత్రిగారి పవర్ అన్న టాక్‌ ఇప్పుడు సంగారెడ్డిలో మారుమోగిపోతుంది. మరి గులాబీ తోటలో విరిసిన కబ్జాలు ఇవొక్కటేనా? ఇలా బయటపడినవి కొన్నే.. పడాల్సినవి ఇంకేన్నో అన్నది రాను రాను బయటపడనుంది.

Tags

Related News

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Big Stories

×