EPAPER

BRS Leaders Arrest: కౌశిక్‌రెడ్డి సవాల్.. ముందస్తుగా బీఆర్ఎస్ నేతల అరెస్ట్

BRS Leaders Arrest: కౌశిక్‌రెడ్డి సవాల్.. ముందస్తుగా బీఆర్ఎస్ నేతల అరెస్ట్

BRS Leaders Arrest: బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. నేతల మధ్య అంతర్గత పోరు సవాళ్లు-ప్రతి సవాళ్లకు దారి తీసింది. రెండురోజులుగా సాగుతున్న మాటల యుద్ధం.. గురువారం నాటికి తారాస్థాయికి చేరింది. కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఆయన మద్దతుదారులకు- ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అనుచరుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో శుక్రవారం గాంధీ ఇంటికి వెళ్తానంటూ సవాల్ విసిరారు కౌశిక్‌రెడ్డి. గురువారం జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు ముందుగా అలర్ట్ అయ్యారు.


శుక్రవారం ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి వస్తానంటూ కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపు ఇచ్చారు. శుక్రవారం ఉదయం తెల్లవారు జామున బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి వారిని గృహనిర్భంధం చేశారు పోలీసులు. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లడానికి వీల్లేదన్నారు పోలీసులు.  కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీష్‌రావును హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాగైనా బయటకు వెళ్లాలని చూశారు హరీష్‌రావు. తన భుజానికి గాయం అయ్యిందని, ఆసుపత్రికి వెళ్తానని చెప్పి పోలీసులను కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశారు. అందుకు పోలీసులు నిరాకరించారు.


ALSO READ:  సీఎం రేవంత్ సీరియస్.. డీజీపీకి ఆదేశాలు

మరోవైపు హరీష్‌రావు ఇంటికి వెళ్లేందుకు సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయా నేతలు అక్కడికక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డి, వెస్ట్ మారేడుపల్లిలో తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులను అడ్డుకుని గృహనిర్భంధం చేశారు.

Related News

Hydra Bulldozers Ready: మూసీ ఆక్రమణలు.. రెడీగా హైడ్రా బుల్డోజర్లు, ఇప్పటికే నోటీసులు.. రేపోమాపో

Harish Rao: అబద్ధాల కాంగ్రెస్: హరీష్ రావు ఆగ్రహం

Hydra: బ్రేకింగ్ న్యూస్.. సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన హైడ్రా కమిషనర్.. ఇక కూల్చివేతలు ఆగనున్నాయా?

CM Revanth Reddy: హైడ్రా ఆగదు.. ఆ పెత్తనం సాగదు: సీఎం రేవంత్

Rajiv Gandhi statue: రాజీవ్ గాంధీ విగ్రహంపై బీఆర్ఎస్ రాద్ధాంతం ఎందుకు? కేటీఆర్ అంత మాటెందుకు అన్నాడు?

Telangana Liberation Day: పాలనే లేదు.. ప్రజా పాలన దినోత్సవమేంటీ?: కేటీఆర్ విసుర్లు

Khairtabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం పూర్తి.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

Big Stories

×