EPAPER
Kirrak Couples Episode 1

BRS Drama on Hydra: డ్రామా షురూ చేసిన బీఆర్ఎస్ కట్ చేస్తే.. ఇలా దొరికిపోయారు

BRS Drama on Hydra: డ్రామా షురూ చేసిన బీఆర్ఎస్ కట్ చేస్తే.. ఇలా దొరికిపోయారు

BRS High Drama on Hydra Musi Demolition: సరే నిర్వాసితులంటే.. బీఆర్ఎస్ కు గౌరవం ఉంది అనుకుందాం. మరి గత పదేళ్లు ఏం చేశారు. ఏం జరిగిందో కూడా అందరికీ తెలియాల్సిన అవసరం, గుర్తు చేయాల్సిన సందర్భం వచ్చింది. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల గుర్తింపు దగ్గర్నుంచి గౌరవెల్లి, మల్లన్నసాగర్ దాకా నిర్వాసితులకు నిర్వేదమే మిగిలింది. ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వలేదు. చేయాల్సిన న్యాయం చేయలేదు. ఇప్పుడు వచ్చి కొత్తగా మాట్లాడడమే అందరూ ఆశ్చర్యపోయే విషయం.


ఇప్పుడు మూసీ విషయంలో బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే.. గతంలో వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల విషయంలో నిర్వాసితులను చాలా పకడ్బందీగా ఆదుకునే ఉంటారన్న ఆలోచన సహజం. కానీ పూర్తి డిఫరెంట్ గా గేమ్ నడిచింది. ఒక్కసారి సీఎం హోదాలో కేసీఆర్ ఏమన్నారో చూడండి.

తెలంగాణలో ఏమూలకు వెళ్లినా ఎకరం భూమి 10 లక్షలకు తక్కువ లేదని, 20 లక్షలకు పైనే ఉందని చెబుతూ వచ్చారు KCR. మరి అంత లెక్కలు చెప్పిన గులాబీ బాస్.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అనంతగిరి, రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ల ముంపు బాధితులకు, భూనిర్వాసితులకు పరిహారం ఈ లెక్కన భారీగానే ముట్టజెప్పి ఉంటారనుకునేరు. భూసేకరణ దగ్గర్నుంచి పరిహారం దాకా, పునరావాసం దాకా పెద్ద యుద్ధాలే జరిగాయి. ఇంత చేసినా బాధితులకు దక్కింది అంతంతే. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చామని నాటి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. సీన్ కట్ చేస్తే ఎకరాకు దక్కింది పది లక్షలోపే మరి. మాటల్లో చెప్పినదానికి చేతల్లో చేసిన దానికి చాలా గ్యాప్ ఉంది. నిర్వాసితులది ఒక్క గోస కాదు. ఎవరికీ సంపూర్ణంగా పరిహారం రాలేదు. చెప్పాలంటే జీవితాలు ఆగమయ్యాయి. ముంపు గ్రామాలను ఇప్పటికీ పట్టించుకోలేదు. వాళ్లను కదిలిస్తే రియాక్షన్ ఇదీ.


అంతే కాదు.. భూసేకరణ విషయంలో 2013 చట్టానికి మించిన ప్రయోజనాలను నాటి కేసీఆర్ సర్కారు కోర్టుల దగ్గర చెప్పుకుంది. బేసిక్‌ రిజిస్ట్రేషన్‌ విలువ ఎకరానికి 40 వేల నుంచి 50 వేల రూపాయలే ఉందని, కానీ తాము దయ తలిచి, పెద్ద మనసు చేసుకుని జీవో నెంబర్ 123 ప్రకారం ఒక ఎకరానికి 6 లక్షలు చెల్లించామన్నారు. పునరావాసంలో కూడా ఎన్నో ప్రయోజనాలు కల్పించామన్నారు. అంతన్నారు.. ఇంతన్నారు. ఏదైనా గొంతెత్తి అడిగితే లాఠీఛార్జ్ లు, అరెస్టులు, కేసులు. ఇదే జరిగింది. ఎవరైనా భూసేకరణ కోసం వస్తుంటే వారి గుండెలు అదిరిపోయాయి. కాళేశ్వరం మూడో టీఎంసీ కోసమని వస్తే ఎదురుతిరిగిన సందర్భాలూ ఉన్నాయి. అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద భూసేకరణ విషయంలోనూ అదే జరిగింది. నిర్వాసితుల నోటి నుంచి మాట రాకుండా చేశారు.

Also Read: బతుకమ్మ ఉత్సవాలు.. కవిత దూరం.. రీఎంట్రీ వెనక్కి?

నిర్వాసితులపై ఉన్నట్లుండి బీఆర్ఎస్ నేతలకు అతి ప్రేమ వెనుక ఏం జరుగుతోందన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై పెద్ద ఎత్తున సీరియస్ గా ఉద్యమించడానికి కారణాలు ఏమై ఉంటాయని కాంగ్రెస్ నేతలు ఆరా తీశారు. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసిన వారిలో 80 శాతం మంది బీఆర్ఎస్ నేతలే ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరెవరు? ఏ చెరువును కబ్జా చేశారు? అనే చిట్టా మొత్తం తన దగ్గర ఉందంటున్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులను సీఆర్ఫీఎఫ్ జవాన్లతో నిర్బంధించారని, ఖమ్మంలో రైతుల చేతికి బేడీలు వేసి తీసుకెళ్లలేదా? అని ప్రశ్నిస్తున్నారు.

మూసీ పరివాహక ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందులో కొందరికి ఇండ్లు కేటాయించి అక్కడికి తీసుకెళ్లారు కూడా. పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీలు కూడా ఇచ్చారు. అధికారం ఉన్నప్పుడు కెసిఆర్ మూసీ నదిలో 25వేల అక్రమ నిర్మాణాలున్నాయని చెప్పి ఇప్పుడు వాటిని కూల్చమంటే అడ్డుకుంటున్నారంటున్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. మల్లన్న సాగర్ నిర్వాసితుల్లో ఎంతమందిని ఆదుకున్నారో హరీష్ రావు, కేటీఆర్ సమాధానం చెప్పాలంటున్నారు. ఒకసారి నల్గొండ వచ్చి చూడాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారు.

సో మూసీ అభివృద్ధికి ప్రభుత్వం దగ్గర మంచి ప్లాన్స్ ఉన్నాయి. మూసీ బాగు పడితే పెట్టుబడులు మరింతగా వస్తాయి. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో జన జీవనం మెరుగవుతుంది. మంచి నీళ్లతో పంటలు పండితే ఆరోగ్యాలు బాగుంటాయి. పర్యావరణం బాగు పడుతుంది. వరదల ముప్పు తొలగుతుంది.

Related News

Telangana BIG Cricket League: బిగ్ టీవి తెలుగు సెలబ్రెటీ క్రికెట్ లీగ్ షురూ.. లైవ్ చూసేయండి..

Illegal Construction: బీఆర్ఎస్ కథ అడ్డం తిరిగింది.. నిర్ధాక్షిణ్యంగా కొట్టి పారేయండి, కేటీఆర్ మాటలు

Police Alert: దసరా పండగకు ఊరెళ్తున్నారా..? అయితే ఇలా చేయాల్సిందే!

Bathukamma Festival: బతుకమ్మ ఉత్సవాలు.. కవిత దూరం.. రీఎంట్రీ వెనక్కి?

Bathukamma: బతుకమ్మ షెడ్యూల్ విడుదల.. 10న ట్యాంక్ బండ్‌పై సంబురాలు

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

Big Stories

×