EPAPER

BRS Dark Secrets | కేసీఆర్ హయాంలో చీకటి పాలన.. పబ్లిక్ డొమైన్ లో కనిపించని జీవోలు!

BRS Dark Secrets | కడుపు కట్టుకుని పని చేశాం.. అంతా పారదర్శకంగా చేశాం.. అవినీతి లేకుండా పాలన కొనసాగించాం.. ఇదీ మాజీ సీఎం కేసీఆర్ గత పదేళ్లుగా చెబుతూ వచ్చిన మాట. చెప్పే వాళ్లకు వినే వాళ్లు లోకువ అన్నట్లు… వినేవాళ్లు ఉంటే ఎంతైనా చెబుతాం అన్నట్లుగా సాగింది గత కేసీఆర్ సర్కార్ పాలన.

BRS Dark Secrets | కేసీఆర్ హయాంలో చీకటి పాలన.. పబ్లిక్ డొమైన్ లో కనిపించని జీవోలు!

BRS Dark Secrets | కడుపు కట్టుకుని పని చేశాం.. అంతా పారదర్శకంగా చేశాం.. అవినీతి లేకుండా పాలన కొనసాగించాం.. ఇదీ మాజీ సీఎం కేసీఆర్ గత పదేళ్లుగా చెబుతూ వచ్చిన మాట. చెప్పే వాళ్లకు వినే వాళ్లు లోకువ అన్నట్లు… వినేవాళ్లు ఉంటే ఎంతైనా చెబుతాం అన్నట్లుగా సాగింది గత కేసీఆర్ సర్కార్ పాలన. పైకి అంతా పారదర్శకం అని చెబుతున్నా.. జరిగిందంతా చీకటి పాలనే అన్నది బహిరంగ రహస్యం. పాలన అంతా బాగుంటే.. జీవోలను ఎందుకు రహస్యంగా ఉంచారు..? ఈ ఆఫీస్ విధానం ఎందుకు ఫాలో అవలేదు? వీటికి జవాబు సున్నా.


ఇప్పుడంతా ఆన్ లైన్ యుగమే… ఏ పని చేయాలన్నా.. ఏది చూడాలన్నా ఆన్ లైన్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఘనత వహించిన గత కేసీఆర్ సర్కార్ మాత్రం ఆన్ లైన్ వద్దు.. ఆఫ్ లైన్ ముద్దు అన్నట్లుగా వ్యవహారం నడిపింది. పైకి కడుపు కట్టుకుని పని చేశామని తియ్యటి మాటలు చెప్పినా… లోలోపల అంతా రహస్యమే. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు.. రాత్రికి రాత్రి మారే లెక్కలు ఎవరికీ అంతు చిక్కవు. అంతు బట్టవు. ఎవరు మార్చారో తెలియదు.. ఎందుకు మార్చారో తెలియదు.. అంతా రహస్యంగా సాగిపోతుంటుంది. అదీ కేసీఆర్ సర్కార్ ను నడిపిన విధానం.

అంత పారదర్శకంగా ప్రభుత్వం నడిపితే… జీవోలను ఆన్ లైన్ లో పెట్టేందుకు భయమెందుకు?
దీనికి జవాబు లేదు. దేశమంతా ఈ ఆఫీస్ విధానంలో ఫైల్ ట్రాన్స్ ఫర్స్, మూవ్ చేస్తుంటే.. తెలంగాణలో ఎందుకు ఫాలో అవలేదు.. దీనికి జవాబు లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జీవో వెబ్ సైట్ లో పెట్టగా.. తెలంగాణ ప్రభుత్ర్వం రహస్య జీవోలు ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది? ఒకటి కాదు రెండు కాదు.. అన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే మాజీ మంత్రి కేటీఆర్ కు చెందిన మునిసిపల్ శాఖలోనే ఎందుకు రహస్య జీవోలు పెట్టడం, ఈ జీవోల్లో జరిగిన గోల్ మాల్ ఏంటన్న ప్రశ్నలకు ఇప్పటికీ జవాబు లేదు. అవినీతి లేదు లేదని చెబుతూనే.. పారదర్శతకు ఎందుకు పాతర వేశారన్న ప్రశ్నలకు జవాబు లేదు.


ఆన్ లైన్ ఫైల్స్ కంటే ఫిజికల్ ఫైల్స్ కే గత కేసీఆర్ సర్కార్ మొగ్గు చూపింది. ఈజీగా మాయం చేయవచ్చన్నదే ఇందుకు కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 2008 నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టడం మొదలు పెట్టింది. పారదర్శకతకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఏవైనా జీవోలపై జనం నుంచి ప్రజా సంఘాల నుంచి విపక్షాల నుంచి ప్రశ్నలు వచ్చినా వాటిని వివరించేందుకే ఇష్టపడ్డారు తప్ప రహస్య జీవోల జోలికి వెళ్లలేకపోయారు. నిజానికి ప్రభుత్వానికి సంబంధించి ఏవి రహస్యంగా ఉంచాలంటే.. దేశ భద్రత విషయాలకు చెందిన వాటినే సీక్రెట్ గా ఉంచాలి. మిగితావన్నీ ఆన్ లైన్ లో పెట్టాల్సిందే. ఇది చట్టం చెబుతున్న మాట. కానీ ఆ చట్టాలను పరిహాసం చేసేలా గత సర్కారు వ్యవహారాలు నడిపిందన్నది నిజం.

ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో చూద్దాం. 2008 నుంచి వైఎస్ హయాంలో అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టడం మొదలు పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 2013 డిసెంబర్ వరకు ఆర్థిక శాఖ 23, 667 జీవోలు జారీ చేసింది. వాటిలో 21,676 జీవోలు అందరికీ అందుబాటులో ఉంచారు. మిగితావి మరీ సెన్సిటివ్ అయి ఉన్న వాటినే హైడ్ చేశారు. అటు సాధారణ పరిపాలనా శాఖలో 30,010 జీవోలు జారీ చేస్తే అందులో కేవలం 408 మాత్రమే రహస్యంగా ఉంచారు. మిగితావన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉంచారు. అటు న్యాయశాఖలో 11,522 జీవోలు పెడితే.. ఒకటే హైడ్ చేశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 8976 జీవోల్లో నాలుగే రహస్యంగా పెట్టారు. పారదర్శక పాలన అంటే అది.

కేసీఆర్ సర్కార్ 2014లో గద్దెనెక్కాక జీవోలన్నిటినీ సీక్రెట్ గా ఉంచేశారు. 2014 నుంచి ఇప్పటిదాకా జీవోలు పబ్లిక్ డొమైన్ లో లేకుండా చేశారు. నియామకాల గురించి కూడా రహస్యంగానే ఉంచారు. రహస్య జీవోలపై చాలా మంది హైకోర్టు మెట్లెక్కారు. కేసులు వేశారు. ఇదేం పాలన అంటూ నిలదీశారు. దీనిపై హైకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గవర్నమెంట్ ఆర్డర్స్ ను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే చాలా జీవోలను సీక్రెట్ గానే ఉంచేశారు. జీవోఐఆర్ వెబ్ సైట్ ను యూజర్ ఫ్రెండ్లీ కాకుండా అంతా గందరగోళంగా మార్చి పడేశారు. 2014 నుంచి 2019 వరకు 1,04,171 జీవోలు జారీ చేస్తే.. 42,462 జీవోలు రహస్యంగా ఉంచారు. కేసీఆర్ సెకండ్ టర్మ్ లో అయితే లక్షకు పైగా జీవోలు సీక్రెట్ గా ఉంచేశారు.

ఏమీ లేకపోతే ఇన్నేసి జీవోలు బ్లాంక్ గా పెట్టడానికి కారణాలేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. కొన్ని జోవోలను సహజంగానే బ్లాంక్ గా పెడుతారు. అవి చాలా సీక్రెసీగా ఉండాల్సినవే. అయితే ప్రజలకు సంబంధించిన విషయాలను జనానికి తెలియకుండా చేయడమేంటన్నదే క్వశ్చన్ మార్క్.

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×